• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • INSTEAD OF CASUAL SEX DO YOU WANT RELATIONSHIP HERE IS THE EXPERTS ANSWER MS GH

Sexual Wellness: క్యాజువల్ సెక్స్ వద్దనుకొని.. రిలేషన్‌షిప్ కావాలనుకుంటున్నారా..?

Sexual Wellness: క్యాజువల్ సెక్స్ వద్దనుకొని.. రిలేషన్‌షిప్ కావాలనుకుంటున్నారా..?

ప్రతీకాత్మక చిత్రం

ఎమోషనల్ రిలేషన్‌షిప్ (Emotional Relationship) కోరుకునేవారు తమకు తెలియకుండానే క్యాజువల్ సెక్స్ (Casual Sex) కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. భయం, ఆందోళనల వల్ల ఇలా చేయవచ్చు. కమిట్మెంట్, భావోద్వేగాలకు గురయ్యే అవకాశం, గతంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వంటివి ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు.

  • News18
  • Last Updated:
  • Share this:
క్యాజువల్ సెక్స్ (casual sex) అనేది తప్పు కాదు. సెక్స్‌తో ఆనందం, సంతృప్తి పొందినప్పుడు వయసు, ఇతర అపరాధ భావాల కారణంగా సెక్స్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది క్యాజువల్ సెక్స్ కోసం ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ మరింత ఎమోషనల్ రిలేషన్‌షిప్ (emotional relationship) కావాలని కోరుకుంటారు. ఇలాంటి వారు క్యాజువల్ సెక్స్, దీనికి సంబంధించిన ఎమోషన్స్‌ నుంచి బయటకు రావడం పెద్ద కష్టమైన పనికాదు. ఎమోషనల్ రిలేషన్‌షిప్ కోరుకునేవారు తమకు తెలియకుండానే క్యాజువల్ సెక్స్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. భయం, ఆందోళనల వల్ల ఇలా చేయవచ్చు. కమిట్మెంట్, భావోద్వేగాలకు గురయ్యే అవకాశం, గతంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వంటివి ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఒకవేళ లవ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన వైఖరి మిమ్మల్ని ప్రభావితం చేస్తుందేమో గుర్తించాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి. అంతర్లీనంగా ఉండే ఇలాంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి సైకోథెరపిస్ట్ లేదా కౌన్సెలర్ల సాయం తీసుకోవాలి.

స్నేహితుల సాయం తీసుకోవాలి..

ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని చెక్ చేయమని స్నేహితులను అడగవచ్చు. క్యాజువల్ సెక్స్ పార్ట్నర్‌ను కలిసినప్పుడు తెలియని మత్తులోకి వెళ్లడాన్ని గమనిస్తే.. దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. వారిని మామూలుగా కలవడానికి వేళ్లేటప్పుడు స్నేహితులను కూడా తోడు రమ్మనాలి. ఒకవేళ వారు దగ్గర లేనప్పుడు వెంటవెంటనే ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాలి. మీ అలవాట్లు, పద్దతుల్లో మార్పులను గుర్తించాలి. ఎలాంటి అలవాట్లను బ్రేక్ చేస్తున్నారో గుర్తించాలి. మంచి రిలేషన్‌షిప్‌కు బదులుగా క్యాజువల్ సెక్స్‌ను ఎ౦పిక చేసుకోవడానికి ఏయే మార్గాలు దారితీస్తున్నాయో గమనించాలి. దీనికి తగ్గట్లు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం


నియమాలు అవసరం..

ఒకవేళ ఇలాంటి పద్ధతులన్నీ పాటించినా, మళ్లీ క్యాజువల్ సెక్స్‌కే మొగ్గుచూపితే.. అందుకు మిమ్మల్ని మీరు శిక్షించుకోవాల్సిన అవసరం లేదు. మీ కోసం మీరు మరిన్ని కొత్త నియమాలను రూపొందించుకోవాలి. వాటిని సక్రమంగా పాటించినప్పుడు మీకు మీరు చిన్న గిఫ్ట్స్‌ ఇచ్చుకోండి. ఈ నియమాలు మిమ్మల్ని బాధపెట్టకుండా ఉండాలి. ఇవి మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టేవిగా ఉంటే, మీరు కోపంతో పాత అలవాట్లకే మొండిగా మెగ్గుచూపుతూ, పాత మార్గాన్నే ఎంచుకునే అవకాశం ఉంది.

ప్రేమ కోసం ఆరాటం వద్దు..

ఒకవేళ మీరు ప్రేమ కోసం అన్వేషిస్తుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇతరుల వెంట పడకుండా, మీ వద్దకే ప్రేమ వచ్చేలా చూసుకోవాలి. వ్యక్తులను కలవడానికి, వారితో కనెక్ట్ కావడానికి ఓపెన్‌గా ఉండాలి. కానీ ఈ కనెక్షన్‌కు, ఎమోషనల్ లేదా ఫిజికల్‌ కనెక్షన్‌కు చాలా తేడా ఉంటుందని గుర్తించాలి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి దొరికితే, వారి గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. అలాంటి వారితోనే లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలి.
Published by:Srinivas Munigala
First published: