Air Pollution: ఇంటి లోపల వాయు కాలుష్యానికి 5 ముఖ్య కారకాలు ఇవే...

ప్రతీకాత్మక చిత్రం

Air Pollution: ఇంటి లోపల భాగంలో పొగ రావట్లేదు అంతా బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు. గాలి నాణ్యతను పరిశీలిస్తే ఔట్ డోర్(Outdoor) కంటే ఇండోర్ లో వాయు కాలుష్య స్థాయి 2 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది 100 రెట్లుకు మించి ఉంటుంది.

  • News18
  • Last Updated :
  • Share this:
కాలుష్యం(Pollution).. నానాటికి పెరుగుతోన్న సమస్య. ముఖ్యంగా వాయుకాలుష్యమైతే నియంత్రించడం కష్టంగా మారింది. బయటకొస్తే(Outdoor) దుమ్ము, దూళినే కాకుండా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. పోనీ ఇంటి లోపలైనా (Indoor) సురక్షితంగా ఉందా అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇండోర్ లో ప్రసరించే గాలి నాణ్యత చెడుగా మారుతుంది. అంటే లోపల భాగంలో పొగ రావట్లేదు అంతా బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు. గాలి నాణ్యతను పరిశీలిస్తే ఔట్ డోర్(Outdoor) కంటే ఇండోర్ లో వాయు కాలుష్య స్థాయి 2 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది 100 రెట్లుకు మించి ఉంటుంది.

గాలి కాలుష్యం ఫలితంగా ఊపిరి బాగా పీల్చుకోలేకపోవడం, ఆస్థమా(Asthama), హృదయనాళ ఇబ్బందులు, లాంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యతను మెరుగుపరచుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

కిచెన్(Kitchen)..
ఇంటి లోపలి కాలుష్యానికి సంబంధించి మీ వంటగది ప్రధాన కారణం. టెఫ్లాన్(Teflon) తో పూత పూసి సరిగ్గా ఇన్ స్టాల్ చేయకపోవడం, వెంటేడ్ గ్యాస్ స్టవ్స్ లాంటి కారకాల వల్ల మీ ఇంట్లోకి హానికరమైన రసాయానాలు విడుదలయవుతాయి. ఈ రసాయానాల్లోని అధిక సాంద్రత వాయువుల వల్ల వికారం, తలనొప్పి. గందరగోళం, శ్వాసకోశ సమస్యలు లాంటివి కలుగుతాయి.

థర్డ్ హ్యాండ్ స్మోక్(Thirdhand smoke)..
సిగరెట్ కాల్చేటప్పుడు ఒకరిది మరొకరు కాల్చడం వల్ల పస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ స్మోక్ గురించి తెలుసుకానీ ఈ థర్డ్ హ్యాండ్ పొగ ఏంటని ఆశ్చర్యపోవద్దు. ధూమపానం చేసిన తర్వాత కాల్చిన సిగరెట్లను గోడ, ఫర్నీచర్, కార్పెట్, కుషన్లు లాంటి వాటికి రుద్దుతుంటారు. కాలిన సిగరెట్లో ఉండే రసాయాన అవశేషాలనే థర్డ్ హ్యాండ్ స్మోక్ అని అంటారు. ఇవి ఇతర రెండు రకాల పొగ మాదిరే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

పెయింట్(Paint)..
గోడలకు రంగు వేయడానికి ఉపయోగించే పెయింట్లలో అస్థిర సేంద్రియ సమ్మేళనాలు(Voltile organic compounds-VOC) ఉంటాయి. పెయింట్ ఇంకా తడిగా ఉన్నప్పుడు రసాయాన్ని గాల్లోకి బదిలీ అయ్యే అవకాశముంది. ఇలాంటి గాలిని పీల్చినప్పుడు శ్వాసకోస సమస్యలు వచ్చే ప్రమదాముంది. ఈ ప్రమదాన్ని తగ్గించడానికి VOC రహిత లేదా తక్కువ VOCలను కలిగి ఉండే పెయింట్స్ ను ఉపయోగించండి. కిటికీలను తెరిచి ఉంచండి. అంతేకాకుండా పెయింట్(Paint) డబ్బాలు సరిగ్గా మూసివేశారో లేదో నిర్ధారించుకోండి.

కార్పెట్(Carpet)..
మీ కార్పెట్ కొత్తది లేదా పాతదయినా.. రెండూ వాయు కాలుష్యానికి(Air Pollution) కారణమవుతాయి. నూతన కార్పెట్ ఫ్రాబ్రిక్(Fabric) తో తయారు చేయడం వల్ల దాన్ని అంటుకుని ఉండి హానికరమైన వాయువులు గాల్లోకి విడుదలవుతాయి. పాత కార్పెట్లో దుమ్ము పేరుకుని ఉండటం, పురుగులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు లాంటివి అతుక్కుని ఉంటాయి. దీని వల్ల అలెర్జీ, తలనొప్పి. దద్దుర్లు, కళ్లు, గొంతు చికాకుగా మారడం లాంటి వాటి గురించి చాలా మంది ఫిర్యాదు చేస్తారు. దీన్ని నివారించడానికి వారానికి ఓ సారి మీ కార్పెట్ ను సరిగ్గా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి.

సామాగ్రిని శుభ్రపరచుకోవడం..
సామాగ్రి శుభ్రంగా ఉంచడమనేది ఇంటిని శుభ్రంగా ఉంచడానికి మాత్రమే అనుకునంటే మీరు పొరబడినట్లే. కొన్నింటిలో ఉండే రసాయానాలు విషపూరిత పొగలను విడుదల చేస్తాయి. ఇండోర్ గాలిని పీల్చుకునేలా చేస్తుంది. అందుకే ఏదైనా వస్తువును కొనడానికి ముందు లేబుల్(Lable) కచ్చితంగా పరిశీలించండి. ఏరోసిల్(Aerocel) లేని, సువాసన రాని ఉత్పత్తులను మాత్రమే వాడండి.
Published by:Srinivas Munigala
First published: