ఆధునిక యుగంలో కాలుష్యం(pollution) రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటిజనం అనారోగ్యం బారిన పడుతుంటే ఇక భవిష్యత్తు తరాలపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ జీవనాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం వాడి పడేసిన పదార్థాలు వ్యర్థాలుగా మారి మనకే రోగాలు తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) చెందిన పరిశోధకులు బయో ఇటుకల(Bio bricks)ను తయారుచేసి ఓ ఇల్లు(building) నిర్మించారు. భారతదేశపు మొదటి బయో-బ్రిక్స్ ఆధారిత బిల్డింగ్( First bio bricks building) హైదరాబాద్ ఐఐటిలో నిర్మించి, ప్రారంభించారు. వ్యవసాయ వ్యర్థాలతో పర్యావరణ అనుకూలమైన ఇటుకలతో నిర్మించారు. అంతేకాదు అతితక్కువ ఖర్చుతో ఈ భవనం పూర్తిచేయడం విశేషం. అయితే ఈ ఇటుకలను రైతులు(formers) కూడా సులభంగా వారి పంటలలో తయారు చేసుకోవచ్చంట. వాయి కాలుష్యాన్ని నివారించడానికి ఈ ఇటుకలు అభివృద్ధి చేశారు. ఈ ఇటుకల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఐఐటీ హైదరాబాద్ డిజైన్ డిపార్ట్మెంట్ పీహెచ్డీ స్కాలర్ ఆర్. ప్రియాబ్రతా రౌత్రే(Priyabrata Rautray) బృందం బయో ఇటుకల తయారీపై పరిశోధనలు చేసింది. ఈ ఇటుకలతోనే ఇపుడు బిల్డింగ్ నిర్మించారు. భారత్లో ఏటా 500 మిలియన్ టన్నులకు పైగా వ్యవసాయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ వ్యర్థాల్లో కొంత పశుగ్రాసంగా వాడుతున్నారు. దాదాపు 84 నుంచి 141 మిలియన్ టన్ను లు బుడిద అవుతోంది. దీంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోంది. మట్టితో తయారుచేసే ఇటుకలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం(pollution) అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి బయో ఇటుకల తయారీకి 1990లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో ఇటుకల (bio bricks)ను అభివృద్ధి చేసే ప్రయోగం గత కొంతకాలంగా జరుగుతోంది. బయో ఇటుకలు మట్టి ఇటుకల కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. కాలిన మట్టి ఇటుకల్లా ఇవి బలంగా ఉండకపోయినా బరువు మోసే నిర్మాణాలకు ఉపయోగించలేం. కానీ, చెక్క లేదా లోహ నిర్మాణాల్లో వాడితే తక్కువ ఖర్చుతో గృహాలు నిర్మించుకోవచ్చు. భవనాల్లో తేమను నిరోధిస్తాయి.
ఇది కూడా చదవండి: ఆవు పేడతో విగ్రహాలు, మొబైల్ స్టాండ్లు.. లక్షలు తెచ్చిపెడుతున్న వ్యాపారం
ఎలా తయారు చేస్తారంటే..
‘వరి వ్యర్థాలు, గోధుమ వ్యర్థాలు (గడ్డి తదితరాలు), చెరుకు పిప్పి, కాటన్ ప్లాంట్ వంటి పొడి వ్యర్థాలను ఉపయోగించి తయారు చేస్తాం. చెరుకు భాగస్సే (పిప్పి), సున్నం ఆధారిత ముద్ద తయారు చేయడం ఇటుక తయారీలో తొలి ప్రక్రియ. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, ఒకట్రెండు రోజులు ఆరబెట్టి, ఆ తర్వాత ఇటుకలను 15 నుంచి 20 రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని వినియోగించడానికి నెల రోజులు పడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air Pollution, Hyderabad, IIT Hyderabad, Tallest building