హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Holika Dahan: హోలీ వేడుకలకు సిద్ధమవుతున్న భారతీయులు.. పూజా పద్ధతులు, శుభ గడియల వివరాలు..

Holika Dahan: హోలీ వేడుకలకు సిద్ధమవుతున్న భారతీయులు.. పూజా పద్ధతులు, శుభ గడియల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హిందువులు జరుపుకొనే ప్రముఖ పండుగలలో హోలీ(Holi) ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుంది. హోలీ పండుగ హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది.

హిందువులు జరుపుకొనే ప్రముఖ పండుగలలో హోలీ(Holi) ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుంది. హోలీ పండుగ హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పూర్ణిమ తిథి నాడు హోలికా దహన్(Holika Dahan) జరుపుతారు. మరుసటి రోజు చైత్రమాసంలోని ప్రతిపాద తిథిలో రంగుల పండుగ హోలీ జరుపుకొంటారు. ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చి 17వ తేదీన జరుపుకొంటారు. మార్చి 18వ తేదీన రంగులు ఆడతారు. హిందూ సంప్రదాయాల ప్రకారం.. హోలికా దహన్‌కు ఎనిమిది రోజుల(Eight Days) ముందు, హోలాష్టక్ అమలులోకి వస్తుంది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదని ప్రజలు విశ్వసిస్తారు. మార్చి 10వ తేదీ నుంచి హోలాష్టక్ అమల్లోకి వచ్చింది.

వామ్మో... పెట్రో ధరలు భరించడం నావల్ల కాదు.. గుర్రం స్వారీయే నయం.. వైరల్ వీడియో

పంచాంగం ప్రకారం.. పూర్ణిమ తిథి మార్చి 17వ తేదీన మధ్యాహ్నం 01:29 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 18వ తేదీన ఉదయం 12:47 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత.. చైత్ర మాసం ప్రారంభమవుతుంది. మార్చి 18వ తేదీన, కృష్ణ పక్షం ప్రతిపాద తిథి అర్ధరాత్రి 12:48 గంటల నుంచి అమలులోకి వస్తుంది. హోలికా దహన్ మార్చి 17వ తేదీన జరుగుతుంది.

హోలికా దహన్ శుభ గడియలు రాత్రి 9:20 గంటల నుంచి 10:31 గంటల వరకు ఉంటాయి. ఈపూజను పవిత్ర సమయాల మధ్య మాత్రమే నిర్వహించాలని నమ్ముతారు. లేకపోతే తమ జీవితంలో దురదృష్టం, కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు భావిస్తారు.

హోలికా దహన్‌ పూజా పద్ధతులు

హిందూ సంప్రదాయం ప్రకారం.. హోలికా దహన్‌కు ముందు హోలికను పూజిస్తారు. ఈ రోజున హోలికను పూజించడంతో మనిషి జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. పూర్ణిమ నాడు పొద్దున్నే లేచి స్నానం చేసిన తరువాత, హోలికా ప్రదేశాన్ని సందర్శించి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోవాలి. ఇప్పుడు కొంచెం ఆవు పేడను తీసుకుని, వాటితో హోలిక, ప్రహ్లాదుని విగ్రహాలను తయారు చేయాలి. దీని తరువాత.. మీ చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ ప్రారంభించండి.

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఆఫీసులోమొబైల్ ఫోన్లు వాడొద్దన్న హైకోర్టు

ముందుగా హోలికకు నీళ్ళు సమర్పించండి. ఆ తర్వాత సింధూరం, అక్షింతలు, పూలు, పసుపు, గులాల్, ఏడు రకాల ధాన్యాలు, గోధుమలు, చెరకు, శెనగలు మొదలైన వాటిని ఒక్కొక్కటిగా హోలిక మాతకు సమర్పించండి. హోలికతో పాటు, నరసింహ స్వామిని కూడా పూజించండి. కర్మలు అన్నీ పూర్తి చేసిన తరువాత.. ఒక దారం తీసుకొని ఐదు నుంచి ఏడు ప్రదక్షిణలు చేసి హోలికకు కట్టాలి. అప్పుడు మీరు హోలికా దహన్ చేయవచ్చు.

 హోలికా దహన్ ప్రాముఖ్యత

హిందూ పురాణాలలో హోలిక, ప్రహ్లాదుల కథ ఉంది. ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపు రాజు కుమారుడు. హిరణ్యకశ్యపుడు భగవంతుడిని పూజించడాన్ని వ్యతిరేకించాడు. అయినప్పటికీ.. అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడు. హిరణ్యకశ్యపుడు విష్ణువుపై ఉన్న నమ్మకం కారణంగా తన కుమారుడిని చంపడానికి అనేకసార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారీ విఫలమయ్యాడు.

అప్పుడు ఒక రోజు అతను తన సోదరి హోలికను పిలిచాడు. ఆమెకు అగ్నిలో కూడా కాలకుండా ఉండే వరం ఉంది. రాజు హోలికను ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చోమని అడిగాడు. హోలిక తన సోదరుని ఆజ్ఞను అనుసరించి, ప్రహ్లాదునితో కలిసి అగ్నిలో కూర్చుంది. కానీ అప్పుడు కూడా ప్రహ్లాదుడు విష్ణువు నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. విష్ణువు దయతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడుతాడు. హోలిక ఆ అగ్నిలో కాలిపోతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలికా దహన్ పండుగను జరుపుకొంటారు.

First published:

Tags: Holi 2022, Lifestyle

ఉత్తమ కథలు