భారతీయులు వీసా లేకపోయినా ఈ 8 విదేశాలకూ వెళ్లిరావచ్చు.

ఏదైనా విదేశానికి వెళ్లాలంటే మొదట మనల్ని ఇబ్బంది పెట్టే అంశం వీసా ప్రక్రియ. అసలీ వీసాతోనే పనిలేకుండా విదేశాలకు వెళ్లే ఛాన్సుంటే, అంతకంటే ఏం కావాలి. వీసా లేకపోయినా మనల్ని ఆహ్వానించే దేశాలు కొన్ని ఉన్నాయి. అవి మనల్ని ప్రశాంతంగా సరిహద్దులు దాటమంటున్నాయి.

news18-telugu
Updated: January 8, 2019, 10:47 PM IST
భారతీయులు వీసా లేకపోయినా ఈ 8 విదేశాలకూ వెళ్లిరావచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేపాల్ అందాలు
నేపాల్ అందాలు


నేపాల్
ఈ హిందూ రాజ్యానికి భారతీయులు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఇండియా-నేపాల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం వల్ల, భారతీయులు నేపాల్‌లో స్వేచ్ఛగా తిరగవచ్చు. ఇంకా చెప్పాలంటే అక్కడే నివసించవచ్చు, ఉద్యోగం చెయ్యొచ్చు, నేపాలీలు తిరిగినట్లుగా ఆ దేశమంతా చుట్టేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన, మీకు సంబంధించిన ఏదైనా ఫొటో ఐడీ ఉంటే చాలు, నేపాల్ సరిహద్దులు దాటేయవచ్చు. రోడ్ ట్రిప్‌కి కూడా నేపాల్ అత్యంత అనుకూలంగా ఉంటుంది.

ఫిజీ బ్యూటీ
ఫిజీ బ్యూటీ
 

 

ఫిజీ330 దీవులతో మీ హాలిడేను అద్భుతంగా మార్చేయగలదు పిజీ. ఈ స్వర్గంలాంటి దీవుల్ని చేరుకోవడానికీ, ఇక్కడి అరుదైన పూల జాతులు, వృక్ష సంపదను చూసి రావడానికి వీసాతో పనిలేదు. మీకు వీలైతే ఇక్కడ జెట్ స్కైయింగ్, స్నోర్కెలింగ్ కూడా చెయ్యొచ్చు. వీసా లేకుండానే ఇన్ని ఎంజాయ్‌మెంట్లను పొందడం అదృష్టమనే అనుకోవచ్చు.

భూటాన్ దృశ్యాలు
భూటాన్ దృశ్యాలు


భూటాన్
ప్రపంచంలో ప్రజలు అత్యంత ఆనందంగా జీవిస్తున్నది భూటాన్‌లోనే. ఎందుకో తెలియాలంటే ఆ దేశానికి వెళ్లడం బెటర్. ఈ సంతోష స్వర్గధామం వీసా లేకుండానే తన దగ్గరకు రమ్మంటోంది. భూటాన్‌ను చూసేందుకు విమానంలోగానీ, రోడ్డు మార్గంలోగానీ వెళ్లొచ్చు. ఈ చిన్న దేశం, ఇండియాకి పక్కనే ఉంటుంది. ఎన్నో పాపులర్ టూరిస్ట్ స్పాట్‌లతో ఆకట్టుకుంటోంది.

మాల్దీవుల అందాలు
మాల్దీవుల అందాలు


మాల్దీవులు
హనీమూన్ జంటలు ఎంచుకునే హాట్ స్పాట్ మాల్దీవులు. టికెట్లు బుక్ చేసుకొని స్వర్గం లాంటి ఈ సుందర ప్రపంచాన్ని చుట్టిరావచ్చు. ఇండియన్ పాస్‌పోర్ట్‌తో ఈ ద్వీపంలో 90 రోజులపాటూ ఉండొచ్చు. ఐతే మీకు సంబంధించిన అన్ని రకాల ఐడీలు, ప్రూఫ్‌లూ, బ్యాంక్ అకౌంట్లూ పక్కగా ఉండాల్సిందే.

మారిషస్ అందాలు
మారిషస్ అందాలు


మారిషస్
అద్భుత దృశ్యాల సమాహారంగా గుర్తింపు పొందింది మారిషస్. ఇక్కడ తెల్లగా మెరిసిపోయే సముద్ర తీరాలు మాత్రమే కాదు, అమేజింగ్ హైకింగ్ ట్రయల్స్, ప్రిస్టీన్ బీచ్‌లు, రెయిన్ ఫారెస్ట్‌లు, అరుదైన పూలు, మొక్కల జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడకు వెళ్లేందుకు కూడా వీసాతో పనిలేదు. పైగా మీకు పాస్‌పోర్ట్ ఉంటే, 90 రోజుల వరకూ ఇక్కడ ఉండొచ్చు.

సీషెల్స్ తీరాల బ్యూటీ
సీషెల్స్ తీరాల బ్యూటీ


సీషెల్స్
అద్భుతమైన సముద్ర తీరాలు, సహజ వనరులతో సీషెల్స్ భారతీయులను కట్టిపడేస్తుంది. ఇక్కడి సరిహద్దుల్లో వీసా లేకపోయినా హాయిగా తిరగొచ్చు. ఇక్కడకు వెళ్లగానే విజిటర్స్ పర్మిట్ ఇస్తారు. అది చాలు 90 రోజులపాటూ అక్కడే ఉండిపోవడానికి. మూడు నెలల తర్వాత రిటర్న్ టికెట్ తప్పనిసరి.

అద్భుత ప్రపంచం ఇండొనేషియా
అద్భుత ప్రపంచం ఇండొనేషియా


ఇండొనేషియా
ప్రపంచ పర్యాటకులు, ముఖ్యంగా ఇండియన్స్ ఎంచుకునే మరో టూరిస్ట్ స్పాట్ బాలి. ఇండొనేసియాలోని ఈ తీర ప్రాంతం ఎవర్నైనా తనతో ప్రేమలో పడేస్తుంది. లక్కేంటంటే ఇండియన్స్ ఇక్కడకు వీసా లేకుండా వెళ్లొచ్చు. సరైన పాస్‌పోర్టుతో 30 రోజులు గడపొచ్చు. నెక్ట్స్ టైమ్ మీరు విదేశాలకు వెళ్లదలిస్తే, ఇండొనేషియాను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షనే అవుతుంది.

ఆనందాల అడ్డా మకావు
ఆనందాల అడ్డా మకావు


మకావు
మకావును ఆసియా లాస్ వెగాస్‌గా పిలుస్తారు. పార్టీ లవర్స్‌కి బెస్ట్ ఆప్షన్ ఇది. ఇక్కడి మాల్స్, కేసినోలూ, దీన్నో ఫ్లాషీ స్పాట్‌గా మార్చేశాయి. ఇక్కడకు వెళ్లే భారతీయులు క్యాసినోల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చైనా, పోర్చుగీస్ సంప్రదాయాలు కనిపించే మకావూ పర్యాటకులకు ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ను మిగుల్చుతోంది.

ఇవీ వీసా లేకుండా ఇండియన్స్ వెళ్లగలిగే విదేశాలు. మరి ఇంకెందుకాలస్యం, డెస్టినేషన్ ఎంచుకోండి, వీసా లేకుండా చెలరేగిపోండి.
First published: January 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు