హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Night Life ఎంజాయ్ చేయాలా..దేశంలో టాప్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే

Night Life ఎంజాయ్ చేయాలా..దేశంలో టాప్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian Cities to Enjoy Nightlife : భారతదేశం దాని సంస్కృతి, వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు క్రమంగా ఇక్కడ నైట్ లైఫ్ ట్రెండ్ పెరుగుతోంది. అయితే నైట్ లైఫ్ ఆస్వాదించడానికి దేశంలొ ఉన్న బెస్ట్ పర్యాటక ప్రదేశాలను ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...

  Indian Cities to Enjoy Nightlife : భారతదేశం దాని సంస్కృతి, వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు క్రమంగా ఇక్కడ నైట్ లైఫ్(Night Life) ట్రెండ్ పెరుగుతోంది. అయితే నైట్ లైఫ్ ఆస్వాదించడానికి దేశంలొ ఉన్న బెస్ట్ పర్యాటక ప్రదేశాలను(Best Tourist Places) ఇప్పుడు చూద్దాం.

  గోవా

  సముద్రం ఒడ్డున పార్టీ, నైట్ లైఫ్ గురించి ప్రస్తావించినప్పుడల్లా గోవా పేరు మొదట వస్తుంది. రాత్రి జీవితాన్ని(Night Life)ఆస్వాదించడానికి గోవా సరైన గమ్యస్థానం. దీనిని భారతదేశ పార్టీ రాజధాని(India Party Capital)అని పిలుస్తారు. గోవాలో అనేక నైట్‌క్లబ్‌లు, బీచ్‌లు, గొప్ప బార్‌లు ఉన్నాయి. ఇక్కడ ఏడాది పొడవునా అనేక సంగీత, అంతర్జాతీయ ఉత్సవాలు(International Festivals)నిర్వహించబడతాయి, వీటిల్లో లక్షల మంది ప్రజలు పాల్గొంటారు. రాత్రి పూట బీచ్‌ల వెంబడి పార్టీ చేసుకోవడం మరపురాని అనుభూతి. గోవాలో..బాగా బీచ్, కలాంగుట్ బీచ్, క్యాసినో ప్రైడ్, అంజునా ఫ్లీ మార్కెట్, సైలెంట్ నాయిస్ క్లబ్, లియోపార్డ్ వ్యాలీ, అగోండా, ఫైర్‌ఫ్లై గోన్ బిస్ట్రో బార్, క్లబ్ క్యూబానా, టిటో స్ట్రీట్‌లో నైట్ లైఫ్ ని ఆస్వాదించవచ్చు.

  ముంబై

  డ్రీమ్ సిటీగా పిలువబడే ముంబై...నైట్ లైఫ్ కి ప్రసిద్ధి చెందింది. సిటీ ఆఫ్ లైట్స్‌గా పేరుగాంచిన ఈ నగరం... పార్టీకి మంచి ప్రదేశం. ముంబై ఎప్పుడూ నిద్రపోదు అనే ఓ నానుడి కూడా ఉంది. ముంబైలో అనేక నైట్ క్లబ్‌లు ఉన్నాయి, ఇవి కళ, సంస్కృతి, సంగీతం, నృత్యాలకు కేంద్రంగా ఉన్నాయి. ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, మెరైన్ డ్రైవ్, జుహు బీచ్ వంటి అనేక గొప్ప ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

  Cervical Pain : గంటల తరబడి ఒకే చోట కూర్చొన్ని పనిచేస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మెడ,వెన్ను నొప్పి దూరం

  చండీగఢ్

  మీరు ఎనర్జీ, ఉత్తేజకరమైన అనుభవాలను పొందాలనుకుంటే పంజాబ్ రాజధాని చండీగఢ్ కంటే బెస్ట్ ప్లేస్ మరొకటి ఉండదు. చండీగఢ్ అనేక నైట్‌క్లబ్‌లు, గొప్ప స్మారక చిహ్నాలు, నక్షత్రాల సమూహాలతో అద్భుతమైన పర్యాటక ఆకర్షణల నగరం.ఉదయం పూట ఈ నగరంలో, మీరు చండీగఢ్ రాక్ గార్డెన్, సుఖ్నా లేక్, ఎలాంటే మాల్, టింబర్ ట్రైల్ మరియు చండీగఢ్ రోజ్ గార్డెన్‌లను సందర్శించవచ్చు. పంజాబ్ యొక్క శక్తి, చైతన్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చండీగఢ్ యొక్క అద్భుతమైన దృశ్యం భారతదేశంలోని టాప్ 10 నైట్‌లైఫ్ నగరాలలో ఎందుకు స్థానం పొందిందో చూపిస్తుంది. మీరు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లినా పార్టీలో పంజాబీ సంగీతం లేకుండా, వినోదం అసంపూర్ణంగా కనిపిస్తుంది.

  షిల్లాంగ్

  మేఘాలయ రాజధాని షిల్లాంగ్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటి. ఇక్కడ అత్యధిక వర్షపాతం కనిపిస్తుంది, ఇది మీ నైట్ లైఫ్ ఆనందాన్ని పెంచుతుంది. దాని సహజ అందం కారణంగా దీనిని 'స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్' అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ రుచికరమైన ఆహారం, సంగీతానికి ప్రసిద్ధి చెందింది. ఇతర నగరాల మాదిరిగా కాకుండా, షిల్లాంగ్‌లో లైవ్ బ్యాండ్‌లు, కచేరీ యాక్ట్‌లు, బార్‌లతో ప్రత్యేకమైన నైట్ లైఫ్ ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, షిల్లాంగ్ భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ నైట్‌క్లబ్‌లతో ముందుకు వచ్చింది. ఇది భూమిపై ఉన్న అత్యంత అందమైన నగరాలలో ఒకటి. ఇది ఖచ్చితంగా నైట్ లైఫ్ అనుభవాన్ని పూర్తి చేస్తుంది.

  ఢిల్లీ

  నైట్ లైఫ్ అంటే ఢిల్లీ మీకు సరైన ప్లేస్. భారతదేశ రాజధాని ఢిల్లీలో.. ప్రతి అభిరుచి, బడ్జెట్, అన్ని వయస్సు గల వ్యక్తుల కోసం ఏదో ఒకటి ఉంటుంది. ఢిల్లీలోని ఉత్తమ నైట్‌క్లబ్‌లలో గ్రేటర్ కైలాష్, కన్నాట్ ప్లేస్, హౌజ్ ఖాస్ విలేజ్ ఉన్నాయి. ఢిల్లీలో మీకు కావలసినవన్నీ ఉన్నాయి. మానసిక స్థితిని ఉత్సాహంగా, సరదాగా ఎలా మార్చాలో ఈ నగరానికి తెలుసు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Best tourist places, Chandigarh, Delhi, Goa, Mumbai

  ఉత్తమ కథలు