హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Plants Study: మొక్కల జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయోగాలు.. కొత్త మార్గాలు కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు

Plants Study: మొక్కల జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయోగాలు.. కొత్త మార్గాలు కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు

ఆకుల నిర్మాణాలను మార్చడంతో పాటు జన్యువుల ద్వారా మొక్కల జీవితకాలాన్ని పెంచేందుకు కొత్త మార్గాలను కనిపెట్టారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు. సాధారణ ఆకుల జన్యు నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. మొక్కల జీవిత కాలాన్ని పొడిగించడానికి ఎలాంటి మార్గాలను అవలంభించాలో కనుగొన్నారు.

ఇంకా చదవండి ...

  చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్న నేపథ్యంలో భారత శాస్త్రవేత్తలు అత్యంత ఉపయోగకరమైన మార్గాలను కనుగొన్నారు. ఆకుల నిర్మాణాలను మార్చడంతో పాటు జన్యువుల ద్వారా మొక్కల జీవితకాలాన్ని పెంచేందుకు కొత్త మార్గాలను కనిపెట్టారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు. సాధారణ ఆకుల జన్యు నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. మొక్కల జీవిత కాలాన్ని పొడిగించడానికి ఎలాంటి మార్గాలను అవలంభించాలో కనుగొన్నారు.

  అరబిడోప్సిస్ థాలియానా అనే మొక్కలో సాధారణ ఆకుల అభివృద్ధిని ప్రోటీన్ల ద్వారా నియంత్రించే రెండు జన్యు కుటుంబాలను పరిశోధకులు గుర్తించారు. CIN-TCP, KNOX-II అనే జన్యువులు ట్రాన్స్‌క్రిప్షన్ కారకాలుగా పిలిచే ప్రోటీన్‌లను అంచు వద్ద ఎన్కోడ్ చేసి కొత్త ఆకులు ఏర్పడటాన్ని నిలిపివేస్తాయి. దీనివల్లే కాంపౌండ్ ఆకులు ఏర్పడకుండా సాధారణ ఆకులు ఏర్పడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. మైక్రోబయాలజీ & సెల్ బయాలజీ విభాగానికి చెందిన (MCB) పరిశోధకులు, శోధక లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల సహాయంతో ఈ అధ్యయనాన్ని చేపట్టారు. అధ్యయన ఫలితాలను నేచర్ ప్లాంట్స్ జర్నల్‌లో ప్రచురించారు.

  శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధన సమయంలో రెండు జన్యు కుటుంబాలలోని మల్టిపుల్ మెంబర్స్ ని నిలిపివేశారు. తద్వారా సాధారణ ఆకులు.. సమ్మేళనం ఆకులుగా మారి.. లెక్కలేనన్ని సంఖ్యలో పుట్టుకొచ్చాయి. అంతకు ముందు ఒక కొమ్మకు ఒకటే ఆకు పుట్టుకు వచ్చింది. కానీ శాస్త్రవేత్తలు జన్యు కుటుంబాలను నిలిపివేయడంతో ఒకే కొమ్మకు ఎక్కువగా ఆకులు ఏర్పడ్డాయి. అయితే రెండు జన్యు కుటుంబాలలో ఏదో ఒక్క దాన్ని మాత్రమే నిలిపి వేసినప్పుడు, ఆకులు సమ్మేళనం ఆకులుగా మారలేదు. దీన్నిబట్టి జన్యువులు సమిష్టిగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

  అయితే పరివర్తన చెందిన ఆకులు సాధారణ పెరుగుదలకు విరుద్ధంగా ఉంటూ బలంగా పెరిగాయి. పెరుగుదలకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అవి యవ్వనంగా ఉంటూ పెరుగుతూనే ఉన్నాయి. అరబిడోప్సిస్ మొక్క ఆకులు సాధారణంగా 30 రోజుల్లో పరిపక్వం చెంది.. 60 రోజుల్లోనే ఎండిపోతాయి. కానీ నిలిపివేసిన CIN-TCP, KNOX-II జన్యువులతో ఉత్పరివర్తన చెందిన మొక్కల విషయంలో ఆకులు 175 రోజులు పెరిగాయి. అవసరమైన వాతావరణాన్ని ఏర్పరిస్తే ఇవి మరింత కాలం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలుసుకున్నారు. ఆకులు పరిపక్వం చెందవు కాబట్టి CIN-TCP, KNOX-II జన్యువులను నిలిపివేసి.. మొక్క జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

  First published:

  Tags: Oxygen plants

  ఉత్తమ కథలు