• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • INDIAN RAILWAYS RELEASED NILGIRI MOUNTAIN RAILWAY OOTY TOY TRAIN VIDEO KNOW HOW TO BOOK OOTY TOY TRAIN TICKETS SS

Ooty Toy Train: ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ Video చూస్తే తెలుస్తుంది

Ooty Toy Train: ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ Video చూస్తే తెలుస్తుంది

Ooty Toy Train: ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ Video చూస్తే తెలుస్తుంది (ప్రతీకాత్మక చిత్రం)

Ooty Toy Train | మీరు ఎప్పుడైనా ఊటీ టాయ్ ట్రైన్‌లో జర్నీ చేశారా? ఊటీ టాయ్ ట్రైన్‌లో ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పేందుకు వీడియో రిలీజ్ చేసింది భారతీయ రైల్వే.

  • Share this:
    ఎవరైనా ఊటీ వెళ్తున్నారంటే అక్కడ టాయ్ ట్రైన్ జర్నీ చేయాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. మెట్టుపాళ్యం నుంచి ఊటీకి టాయ్ ట్రైన్‌లో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జర్నీ చేసినవారికే ఆ థ్రిల్ ఏంటో తెలుస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 9 నెలల పాటు ఊటీలో టాయ్ ట్రైన్ నిలిచిపోయింది. మార్చి 20 నుంచి డిసెంబర్ 30 వరకు టాయ్ ట్రైన్ నడవలేదు. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 నుంచి టాయ్ ట్రైన్ సేవల్ని ప్రారంభించింది నీల్‌గిరి మౌంటైన్ రైల్వే-NMR. దీంతో ఊటీ టాయ్ ట్రైన్‌కు మళ్లీ డిమాండ్ పెరిగింది. సదరన్ రైల్వే ఆధ్వర్యంలో నీలగిరి మౌంటైన్ రైల్ ఈ టాయ్ ట్రైన్‌ను నడుపుతుంది.

    మెట్టుపాళ్యం నుంచి ఉదగమండలం అంటే ఊటీ వరకు టాయ్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ప్రతీ రోజు మెట్టుపాళ్యం నుంచి ఊటీకి ఒక ట్రైన్ నడుస్తుంది. అదే ట్రైన్ ఊటీ నుంచి మెట్టుపాళ్యం వరకు వస్తుంది. ఇక ఊటీ నుంచి కూనూర్‌కు మరో టాయ్ ట్రైన్ ఉంది. ఇదే రైలు కూనూర్ నుంచి ఊటీ వెళ్తుంది. ఊటీ-మెట్టుపాళ్యం మధ్య ప్రయాణం నాలుగు గంటలు కాగా, ఊటీ-కూనూర్ మధ్య ప్రయాణం గంట మాత్రమే. ఎక్కువ సమయం టాయ్ ట్రైన్‌లో జర్నీ చేయాలనుకుంటే మెట్టుపాళ్యం నుంచి ఊటీ లేదా, ఊటీ నుంచి మెట్టుపాళ్యం వరకు రైలు టికెట్ బుక్ చేసుకోవాలి. అసలు నీలగిరి కనుమల్లో టాయ్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో తెలిపేందుకు ఇండియన్ రైల్వేస్ ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియాలంటే మీరూ ఈ Video చూడండి.

    IRCTC Tirupathi Tour: భక్తులకు శుభవార్త... తిరుమలలో శ్రీవారి దర్శనంతో టూర్ ప్యాకేజీ

    IRCTC: స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ


    నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్‌ను 1908 లో బ్రిటీష్ కాలంలో నిర్మించారు. ప్రస్తుతం సదరన్ రైల్వే నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్‌లో రైళ్లను నడుపుతోంది. మెట్టుపాళ్యం-ఉదగమండలం (ఊటీ), కూనూర్-ఉదగమండలం (ఊటీ) రూట్లలో టాయ్ ట్రైన్స్ నడుస్తున్నాయి. 2005లో నీల్‌గిరి మౌంటైన్ రైల్వేకు వాల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది. నీలగిరి కనుమల్లో ఎప్పుడూ అత్యంత చల్లగా ఉండే ప్రదేశం ఊటీ. వేసవిలో కూడా ఇక్కడ అత్యంత చల్లగా ఉంటుంది. వేసవితాపం తట్టుకోలేని వారు కొంతకాలం పాటు ఊటీ వెళ్తుంటారు. ఇక చలికాలంలో చలిని ఇష్టపడేవారు కూడా ఊటీ వెళ్తుంటారు.

    IRCTC Kerala Tour: వైజాగ్ నుంచి కేరళకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

    IRCTC: మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుంది? గతంలో కన్నా సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

    ఊటీ టాయ్ ట్రైన్‌లో జర్నీ చేయాలనుకుంటే ముందుగానే టికెట్లు బుక్ చేయడం మేలు. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే టికెట్లు బుక్ అయిపోతాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో టికెట్లు బుక్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: