Life Expectancy: భారీగా పెరిగిన భారతీయుల జీవిత కాలం.. అధ్యాయనంలో తేలిన ఆసక్తికర విషయాలివే!

ప్రతీకాత్మక చిత్రం

Life Expectancy: మన దేశంలో నివసించే వారి సగటు జీవితకాలం ముప్పై ఏళ్లలో భారీగా పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఓ అధ్యాయనం వెల్లడించింది.

  • Share this:
    భారతీయులకు ఇది నిజంగా శుభవార్తే. మన దేశంలో నివసించే వారి సగటు జీవితకాలం ముప్పై ఏళ్లలో భారీగా పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఓ అధ్యాయనం వెల్లడించింది. 1990 వ సంవత్సరంలో మన దేశంలో మనుషుల సగటు జీవిత కాలం 59.6 ఏళ్లు ఉండేది. అయితే ప్రస్తుత 2019లో అది 70.8 ఏళ్లని ఆ అధ్యాయనంలో తేలింది. ఈ ముప్పై ఏళ్ల కాలంలో మరణాలు, వ్యాధుల తీవ్రతపై ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఓ పరిశోధన నిర్వహించారు. దాదాపు 200 దేశాల్లో సాగిన ఈ పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ అధ్యాయనానికి సంబంధించిన వివరాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ లో తాజాగా ప్రచురించారు. వ్యక్తుల మరణాలకు గల 286 కారణాలు, 369 వ్యాధులను విశ్లేషిస్తూ ఈ అధ్యాయనం సాగింది. ఈ ముప్పై ఏళ్లలో భారతీయుల సగటు జీవిత కాలం పదేళ్లకు పైగా పెరిగిందని ఈ అధ్యాయనంలో తేలింది. అయితే రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య ఈ జీవితకాలంలో తేడాలు ఉన్నట్లు ఆ అధ్యాయనంలో పాల్గొన్న నిపుణులు తేల్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనుషుల సగటు జీవిత కాలం అత్యల్పంగా 66.9 ఏళ్లు ఉండగా.. కేరళా రాష్ట్రంలో అత్యధికంగా సగటు జీవిత కాలం 77.3 ఏళ్లు ఉన్నట్లు గుర్తించారు.

    అయితే భారతీయుల జీవితకాలం పెరినప్పటికీ వారు ఆరోగ్యవంతమైన జీవితకాలం గడపలేకపోతున్నారని తేలడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అనేక మంది ఎక్కువ కాలం ఆరోగ్య సమస్యలు, ఇతర వైకల్యాలతోనే ఇబ్బంది పడుతున్నారని పరిశోధనలో పాలు పంచుకున్న గాంధీనగర్ లోని ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. మన దేశంలో అధిక కరోనా మరణాలకు కారణాలను సైతం ఈ నివేదికలో తెలిపారు. అధిక షుగర్, స్థూలకాయం, కాలుష్యం తదితర అంశాలు మన దేశంలో అధిక కరోనా మరణాలకు కారణమని ఈ నివేదిక తెలిపింది.

    భారత్ తో పాటు అన్ని దేశాల్లో అంటువ్యాధుల వ్యాప్తి తగ్గినప్పటికీ, ఇతర ధీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన మొక్దాద్ అన్నారు. వైద్య సదుపాయాలు పెంచడం, టీకాలు వేయడం, రోగ నిరోధక శక్తి పెరిగేలా తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. భారత్ లో మాతాశిశు మరణాలు భారీగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published: