ప్రస్తుతం ప్రపంచ దేశాలు (World Countries) చాలావరకు టూరిజం రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వివిధ దేశాలకు వీసా ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఇండియన్స్ చాలామంది థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ లాంటి ఏషియన్ కంట్రీస్‌కు ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సింగపూర్, మనవాళ్లకు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. సింగపూర్ పర్యాటక బోర్డు లెక్కలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.
సింగపూర్‌కు భారతీయులు రెండో అతి పెద్ద టూరిజం మార్కెట్‌గా ఉన్నారు. అక్కడికి అత్యధికంగా ఇండోనేషియా నుంచి పర్యాటకులు వస్తుండగా, రెండో స్థానంలో ఇండియన్స్ ఉన్నారని సింగపూర్ టూరిజం బోర్డు(STB) తెలిపింది. 2022లో ఇండోనేషియా నుంచి 1.1 మిలియన్ల మంది, భారత్ నుంచి 6,86,000 మంది, ఆస్ట్రేలియా నుంచి 5,91,000 మంది పర్యాటకులు సింగపూర్ వెళ్లారు.
* టూరిజంపై కోవిడ్ ఎఫెక్ట్
కోవిడ్ 19(COVID-19)కు ముందు అంటే 2019 లెక్కలను బట్టి చూస్తే ఇప్పటి 2022 లెక్కలు మూడో వంతు మాత్రమేనని ఎస్‌టీబీ ప్రకటించింది. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోక ముందు పరిస్థితి మరోలా ఉందని చెప్పింది. గతేడాది మొదటి క్వార్టర్ నుంచి కోవిడ్ క్వారంటైన్ మెజర్స్‌లో మార్పులు వచ్చినప్పటికీ చైనా సరిహద్దులను మాత్రం మూసివేసే ఉంచామని, ఫ్లైట్ కెపాసిటీ కూడా లిమిటెడ్‌గానే ఉందని తెలిపింది. అయినప్పటికీ మంచి గణాంకాలే వచ్చాయని ఎస్‌టీబీ కమ్యునికేషన్స్ డైరెక్టర్ టెరెన్స్ వూన్ తెలిపారు.
ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య వచ్చిన ఈ గణాంకాలు సింగపూర్‌లో ట్రావెల్ చేయాలనుకునే టూరిస్టుల డిమాండ్‌కు అద్దం పడుతున్నట్లు టెరెన్స్ తెలిపారు. ‘పోస్ట్ పాండమిక్ లెక్కలు చూస్తే సింగపూర్‌కు టూరిజం ఎట్రాక్షన్ ఏపాటిదో అర్థం అవుతోంది. కోవిడ్‌కు ముందులాగ 2024నాటికి సింగపూర్‌లో టూరిజం పుంజుకుంటుంది’ అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత్ టాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నుంచి పార్ట్నర్‌షిప్స్‌పై దృష్టి పెట్టామని, తమ పర్యాటక వృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఏడాది అంతా ఏవో ఒక ఈవెంట్లు క్యాలెండర్లో ఉండేలా చూస్తున్నామని, కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రోగ్రాంలు డెవలప్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : హిమాచల్ ప్రదేశ్ లోని ఆ ప్లేస్ కి క్యూ కడుతున్న పర్యాటకులు..కులు,మనాలీ కాదండోయ్
* లెక్కలు ఇలా
2022లో సింగపూర్(Singapore)కు సందర్శకుల సంఖ్య 40లక్షల నుంచి 60 లక్షల వరకు ఉంటుందని తాము అంచనా వేశామని అయితే అది గత లెక్కల నాటికే 63లక్షలు దాటిపోయిందని STB తెలిపింది. 2023 రెండో క్వార్టన్ నాటికి 2022కు సంబంధించిన పూర్తి గణాంకాలు అందుబాటులోకి వస్తాయంది. 2022 పూర్తయ్యేనాటికి సింగపూర్ పర్యాటక ఆదాయం 13.8 బిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 14.3 బిలియన్ SGDలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపింది. 2019 లెక్కల్లో చూస్తే ఈ మొత్తం దాదాపు 50 నుండి 52 శాతం మాత్రమే అని వెల్లడించింది.
* టూరిజం వృద్ధిపైనే ఆశలు
ఎస్‌టీబీ అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, జూలియానా కువా మాట్లాడుతూ ప్రీ పాండమిక్‌లో చైనా నుంచి ఎక్కువగా పర్యాటకులు వచ్చేవారని, సంవత్సరానికి 3.6మిలియన్ల మంది అక్కడి నుంచే వచ్చేవారని తెలిపారు. ఈ జనవరి నాటికి సింగపూర్, చైనా మధ్య 38 విమానాలు తిరుగుతున్నాయి. ఇది ప్రీ పాండమిక్‌తో పోలిస్తే పదో వంతు మాత్రమేనని అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తోందన్నారు. విమాన కనెక్టివిటీ, కెపాసిటీ పెరుగుతుండటం, క్రమంగా చైనా సరిహద్దులను రీ ఓపెన్ చేస్తుండటం.. లాంటి కారణాలతో ఈ ఏడాది పర్యాటకం మరింత వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎస్‌టీబీ అంచనా వేస్తోంది.
2019 లెక్కలతో పోల్చి చూసినప్పుడు మూడింట రెండు వంతుల నుంచి మూడు వంతుల వరకు మళ్లీ మర్కెట్ రికవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సింగపూర్ టూరిజం బోర్డు పేర్కొంది. 2023లో దాదాపు 12 మిలియన్ల నుండి 14 మిలియన్ల సందర్శకులు వస్తారని అంచనా వేస్తోంది. దీంతో ఆదాయం కూడా సుమారు 18 బిలియన్ SGD నుంచి 21 బిలియన్ SGDలకు పెరుగుతుందని ఆశిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Singapore, Travel, Travelling