హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breast Cancer: భారత్, పాకిస్థానీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్.. చాలా డేంజర్

Breast Cancer: భారత్, పాకిస్థానీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్.. చాలా డేంజర్

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఇండియన్, పాకిస్తానీ మహిళలల్లో చిన్న వయస్సులో అది కూడా అడ్వాన్డ్స్ స్టేజ్‌లోనే వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది.

భారత్, పాకిస్థాన్‌కు చెందిన మహిళలు చిన్న వయసులోనే తీవ్రమైన రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తాజా పరిశోదన తెలిపింది. యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్‌టిట్యూట్ సంస్థ నుంచి సేకరించిన డేటా ద్వారా తాజా అధ్యయనం చేశారు. చేశారు. అమెరికాలో నివసిస్తున్న ఇండియన్, పాకిస్తానీ అమెరికన్ మహిళలు, నాన్ హిస్పానిక్ తెల్ల జాతి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలను పరిశోధకులు అధ్యయనం చేసి, వివరాలను వెల్లడించారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.

ఇండియన్, పాకిస్తానీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వివిధ రూపాల్లో వ్యాపిస్తోందని రిసెర్చర్లు తేల్చారు. దాని తీవ్రత కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. రట్జర్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, రట్జర్స్ క్యాన్సర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూజెర్సీ సంస్థలకు చెందిన నిపుణులు ఈ పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 1990 నుంచి 2014 సంవత్సరాల మధ్య ఇండియన్, పాకిస్తాన్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులను వారు విశ్లేషించారు.

పరిశోధనతో ఉపయోగాలు..

వ్యాధి కారకాలను, తీవ్రతను అంచనా వేయడానికి తమ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని అధ్యయనానికి నాయకత్వం వహించిన జయ ఎం సతగోపన్ చెబుతున్నారు. రట్జర్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లోని సౌత్ ఏషియన్ క్వాంటిటేటివ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి ఆమె డైరెక్టర్గా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో శాస్త్రీయ అధ్యయనాలకు మార్గనిర్దేశం చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. అమెరికాలోని సౌత్ ఏషియన్ జనాభాలో రొమ్ము క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. ఇందుకు కారణాలు మాత్రం పూర్తిగా తెలియలేదని అధ్యయనంలో పేర్కొన్నారు.

వ్యాప్తి పెరుగుతోంది

పరిశోధకులు 2000 నుంచి 2016 మధ్య రొమ్ము క్యాన్సర్ సోకిన 4,900 మంది ఇండియన్, పాకిస్తానీ మహిళలు, 4,82,250 మంది నాన్ హిస్పానిక్ తెల్ల జాతి మహిళల్లో వ్యాధి లక్షణాలు, చికిత్స, సర్వైవల్ డేటాను విశ్లేషించారు. నాన్ హిస్పానిక్ తెల్ల జాతి మహిళల కంటే ఇండియన్, పాకిస్తానీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి తక్కువగా ఉందని కనుగొన్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ జనాభాలో వ్యాధి వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని వారు గుర్తించారు. రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఇండియన్, పాకిస్తానీ మహిళలల్లో చిన్న వయస్సులో అది కూడా అడ్వాన్డ్స్ స్టేజ్‌లోనే వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. నాన్ హిస్పానిక్ తెల్ల జాతి మహిళలతో పోలిస్తే, దాయాది దేశాల మహిళలు రొమ్ము క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కానీ అధ్యయనం కోసం వారి హెల్త్ డేటాను చాలా తక్కువ సమయానికి ట్రాక్ చేశారు.

అవగాహన ఉండట్లేదు

చాలా తక్కువ మంది ఇండియన్, పాకిస్తానీ మహిళలు శాస్త్రీయ అధ్యయనాలలో పాల్గొంటున్నారని గతంలో చేసిన క్యాన్సర్ పరిశోధనల్లో తేలింది. సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల వారు అనారోగ్యాల గురించి బయటకు చెప్పకపోవడం, మామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోకపోవడం, కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం, భయం, నమ్మకాలు, యూఎస్‌లో పదేళ్ల కంటే తక్కువగా నివసించడం, ఇంగ్లిష్ తెలియకపోవడం, ఆరోగ్య వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల వైద్య పరీక్షలకు చాలామంది దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

తదుపరి అధ్యయనాలకు తోడ్పాటు

తాము పరిశోధన చేసిన జనాభాలో కొన్ని ప్రధాన తేడాలను గుర్తించామని అధ్యయన బృంద సభ్యురాలు ఎలిసా వి బండేరా చెబుతున్నారు. ఆమె రట్జర్స్ క్యాన్సర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూజెర్సీలో క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ రిసెర్చ్ విభాగంలో పనిచేస్తున్నారు. దక్షిణాసియా మహిళలు ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయం చేసుకోవడం, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ విధానాలను గుర్తించడం, రోగ నిర్ధారణ, ప్రమాదం... వంటి సామాజిక, సాంస్కృతిక కారణాలను అర్థం చేసుకోవడానికి తదుపరి అధ్యయనాలు సాయం చేయనున్నాయని ఎలిసా వివరించారు.

అవగాహన పెంచాలి

రొమ్ము క్యాన్సర్ అధ్యయనాల్లో భారతీయ, పాకిస్తానీ మహిళలను నిమగ్నం చేయడానికి, ఆరోగ్య సంరక్షణ చర్యలను మెరుగుపరచడానికి ఈ పరిశోధన ద్వారా నిపుణులు సూచనలు చేయాలి. ఈ జనాభాలో స్క్రీనింగ్ నిర్ణయాలు, ఆరోగ్య సంరక్షణతో సంబంధం ఉన్న సామాజిక, సాంస్కృతిక అంశాలను గుర్తించాలని అధ్యయనం సిఫారసు చేస్తుంది. అమెరికాలో, ముఖ్యంగా న్యూజెర్సీలో దక్షిణాసియా వారి జనాభా పెరుగుతున్న నేపథ్యంలో... క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్స కోసం కమ్యూనిటీల అవగాహన కార్యక్రమాలు, టీం సైన్స్ విధానం ద్వారా హెల్త్ ఈక్విటీని ప్రోత్సహించేందుకు తాము కృషి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయన బృందంలో మరో సభ్యురాలైన అనితా కిన్నే అన్నారు.

First published:

Tags: Breast cancer

ఉత్తమ కథలు