Health tips: ఈ ఆహారం మీ రోజువారీ డైట్​లో చేర్చి షుగర్​ వ్యాధిని తగ్గించుకోండి.. ఎక్కువ కాలం జీవించండి

ప్రతీకాత్మక చిత్రం

మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు. షుగర్ వ్యాధిని కంట్రోల్ (control) చేసుకోవడానికి మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి.

  • Share this:
    మారుతున్న జీవన శైలి కారణంగా మన శరీరానికి అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటిస్ (Diabetes). లేదా షుగర్ వ్యాధి.​ ఇది సాధారణ వ్యాధి(disease) కావచ్చు. కానీ ఎవరికైతే డయాబెటిస్​ వచ్చిందో వారికి జీవిత కాలంలో చాలా కాలం మధుమేహం (diabetes) ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ (glucose) పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు ఇన్స్యులిన్ హార్మోన్ (hormone) స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది, తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు (eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం (weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం దీని ముఖ్య లక్షణాలు.

    మధుమేహం పూర్తిగా మాయమవుతుంది..

    మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య (health problem) మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు. షుగర్ వ్యాధిని కంట్రోల్ (control) చేసుకోవడానికి మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి.

    ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే సందేహం (doubt) కూడా చాలా మందికి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బో హైడ్రేట్స్ తగ్గించుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ (cholesterol) ​ను తగ్గించుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఫుడ్​లో కొవ్వు పదార్థాలు తక్కువుగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్,. మేక, పొట్టేలు మాంసం తినడం తగ్గించుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ (bad cholesterol) కంట్రోల్లోకి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువుగా ఉండాలి. అంటే పీచు పదార్ధం ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    ఇలాంటి ముంద జాగ్రత్తలతో షుగర్ (sugar)​ నియంత్రణలో ఉంచుకోగలిగితే కొంతమేరకు కొలెస్ట్రాల్ కూడా దానికదే కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా ట్రై గ్లిజరాయిడ్స్ నియంత్రణలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్​ను కంట్రోలోకి తెచ్చేందుకు రోగులకు (patients) స్టాటిన్ మాత్రలు ఇస్తుంటాం. 40 ఏళ్లు దాటిన వాళ్లలో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉన్నవాళ్లకి ఈ మాత్రలు ఎక్కువుగా ఇస్తుంటారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..

    Published by:Prabhakar Vaddi
    First published: