Fruits For Health: ఈ ఐదు పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరగడం ఖాయం

ప్రతీకాత్మకచిత్రం

సాధారణంగా వాతావరణ మార్పు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో వ్యాధులు, అనారోగ్యాలు శరీరంపై దాడి చేస్తాయి. నవంబర్ నెల నుంచి మన దగ్గర శీతాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • News18
  • Last Updated :
  • Share this:
సాధారణంగా వాతావరణం ఒక సీజన్ నుంచి మరో సీజన్‌కు మారుతున్నప్పుడు చిన్నపాటి అనారోగ్యాలు ఎదురవుతాయి. దీన్ని సీజనల్‌ సిక్‌నెస్‌ (seasonal sickness) అంటారు. వాతావరణంలో చోటుచేసుకొనే ఆకస్మిక మార్పు కారణంగా వీటి బారిన పడవచ్చు. సాధారణంగా వాతావరణ మార్పు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో వ్యాధులు, అనారోగ్యాలు శరీరంపై దాడి చేస్తాయి. నవంబర్ నెల నుంచి మన దగ్గర శీతాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అది మన ఆరోగ్యానికి ప్రమాదకరం. అంతేగాక కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తి అవసరం కూడా ఎంతో అవసరమని అంటున్నారు.

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. ఎండ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల చాలా మంది శరీరంలో విటమిన్ డి లోపిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనతకు కారణమవుతుంది. దీంతో పాటు చలి గాలుల వల్ల శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోయే అవకాశం ఉంది. చల్లటి గాలిని నిరంతరం తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కూడా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో లభించే కొన్ని రకాల పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. ఎలాంటి పండ్లు తీసుకోవాలంటే...

1. నారింజ
శీతాకాలంలో లభించే నారింజ పండ్లు రుచితో పాటు, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సిట్రస్ కుటుంబానికి చెందిన ఈ జాతి పండ్లు విటమిన్ సి కి మంచి వనరులుగా ఉంటాయి. దీంతో పాటు వీటి నుంచి విటమిన్ డి కూడా సమృద్ధిగా లభిస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల... సి, డి విటమిన్లు శరీరానికి అందుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

2. యాపిల్స్
యాపిల్ పండును సూపర్ ఫుడ్ అంటారు. వీటిల్లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియ రేటును, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

3. దానిమ్మ:  క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధిని రాకుండా నియంత్రించే శక్తి దానిమ్మకు ఉంటుంది. దీంట్లో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దానిమ్మ శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలను నివారించి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానిమ్మ గింజలను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకొని తాగవచ్చు.

Seasonal sickness, Immunity boosters, Benifits of fruits, Oranges, Apples, Pomegranates

4. బత్తాయి
దీన్ని మొసాంబి అని కూడా పిలుస్తారు. ఇది సిట్రస్ జాతికి చెందిన పండు. దీని ద్వారా విటమిన్ సి, ఫైబర్ అధిక మొత్తంలో శరీరానికి అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఈ కాలంలో ఎదురయ్యే సీజనల్ వ్యాధులను నివారించడానికి బత్తాయి సహాయపడుతుంది.

5. కివీ పండ్లు
కివీ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, పొటాషియంతో పాటు విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఫోలేట్ వంటివి కివీ పండు నుంచి అందుతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ పోషకాలు శరీరానికి అంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ రేటును మెరుగు పరిచేందుకు కూడా కివీ పండు దోహదం చేస్తుంది.
Published by:Srinivas Munigala
First published: