ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రతి ఏడాది 400 మిలియన్లకు పైగా ప్రజలు డెంగ్యూ వైరస్ బారిన పడుతున్నారు. డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా ఆడ ఈడిస్ ఈజిప్టి దోమ వల్ల డెంగ్యూ వైరస్‌ను వ్యాపిస్తుంది.
డెంగీ దోమలు (Dengue mosquito) అత్యంత చురుగ్గా ఉంటాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా డెంగీ దోమల (Dengue mosquito) భీభత్సం పెరిగిపోతుంది.అందుకే దేశంలో డెంగీ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దోమలను నివారిస్తేనే.. ఈ వ్యాధిని అరికట్టగలం. అయితే, కేవలం పగటిపూటనే అత్యంత చురుగ్గా తిరిగే ఏడీజీ దోమలు. రోజుకు 3 గంటలపాటు చాలా చురుగ్గా ఉంటాయని మీరు తెలియకపోవచ్చు. డెంగీ దోమలు రోజులో ఏ మూడు గంటలు యాక్టీవ్‌గా ఉంటాయో ఇప్పుడ తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: అన్నం వండే ముందు.. బియ్యాన్ని ఎందుకు నానబెడతారో తెలుసా?
డెంగీ కారకమైన ఏడీజీ (ADG) దోమ పగటిపూట కుడుతుందని మీరు వినే ఉంటారు. కానీ,అవి రాత్రిపూట కూడా చురుగ్గా ఉంటాయి. ముఖ్యంగా కృత్రిమ లైటింలో ఎక్కువ కాంతిని కలిగి ఉంటాయి. ఈ దోమలు సూర్యోదయానికి 2 గంటల తర్వాత, సూర్యాస్తమయానికి 1 గంట ముందు చాలా చురుగ్గా ఉంటుంది. ఈ సమయం అత్యంత ప్రమాదకరం. అందుకే ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 గంటల్లో దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటే.. డెంగీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుందని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: ఈ సీజన్‌లో ఇమ్యూనిటీని సత్వరమే పెంచే సూపర్ సూప్!
డెంగీ అనేది ఫ్లూ లాంటి వ్యాధి, డెంగీ ఇన్ఫెక్షన్ Den–1, Den–2, Den–3, Den–4 వైరస్‌ల ద్వారా వ్యాపిస్తాయి. అంటే డెంగీ సోకిన ఏడీజీ దోమ (ADG mosquito ) వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యక్తికి డెంగీ వస్తుంది. ఈ నాలుగు వైరస్‌లను సెరోటైప్స్ అంటారు. ఎందుకంటే, ఆ నాలుగు రకాల ప్రతిరోధకాలను ప్రభావితం చేస్తాయి. అంటే, మీరు వివిధ రకాల దోమల ద్వారా నాలుగు సార్లు డెంగీ బారిన పడవచ్చు.
ఈ రకమైన లక్షణాలు ఉండవచ్చు..
డెంగీ వ్యాధి సోకిన నాలుగు నుంచి ఆరు రోజుల తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ, కొన్నిసార్లు దీనికి రెండు వారాల సమయం కూడా పట్టవచ్చు. ఈ లక్షణాల్లో అలసట, అధిక జ్వరం, కీళ్ల, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఉంటాయి. వారం రోజులకు పైగా ఈ సమస్యలు ఉండి, ఉపశమనం లభించకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లి డెంగీ పరీక్షలు చేయించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dengue fever