Home /News /life-style /

రాబోయే పదేళ్లలో 18–24 వయస్సువారికి 4 రెట్ల బరువు పెరిగే ఛాన్స్‌! ఇదే అసలు..

రాబోయే పదేళ్లలో 18–24 వయస్సువారికి 4 రెట్ల బరువు పెరిగే ఛాన్స్‌! ఇదే అసలు..

Obesity

Obesity

యువతలో మారుతున్న జీవనశైలి.. ఒబేసిటీకి దారితీస్తుంది. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

ఉబకాయం.. అన్ని అనారోగ్యాలకు ప్రధాన కారణం. ఇది అసాధారణ సమస్య. కరోనా నేపథ్యంలో ఇప్పటికే అందరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం పెద్దవారిలోనే కాదు, 18–24 ఏళ్ల వారిపై కూడా ప్రభావం పడుతుందని ఇటీవలి కొన్ని నివేధికలు తెలిపాయి. అది రాబోయే మరో 10 ఏళ్లలో ..ఇతర వయస్సు వారితో పోలిస్తే.. ఈ వయస్సువారు ఉబకాయంతో బాధపడతారని చెబుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, బెర్లిన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, చారిటీ యూనివర్సిటీస్‌ మెడిజిన్‌ బెర్లిన్‌ పరిశోధకులు ఈ అధ్యయనంపై చేసిన పరిశోధనలను ‘ది లాన్సెట్‌ డయాబెటీస్, ఎండోక్రనాలజీ ప్రచూరించింది. యువతలో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారుతుందని, సామాజిక, ఆర్థిక, లింగ ఇతర సమస్యలు దీనికి ప్రధాన కారణమని అధ్యయనలో కనుగొన్నారు. బరువు పెరిగి.. వయస్సుతోపాటు క్రమంగా తగ్గుతూ వస్తుందన్నారు.

పరిశోధకులు దాదాపు 2 మిలియన్ల యువత ప్రైమరీ కేర్‌ హెల్త్‌ రికార్డులపై ఈ పరిశోధన చేసి..ముఖ్యంగా 1998–2016 సంవత్సరంలో పుట్టిన ఏజ్‌ గ్రూపుల్లో ఎక్కువ శాతం ఒబేసిటీ బారిన పడే రిస్క్‌ ఎక్కువ ఉందని చెప్పారు.

రాబోవు పదేళ్లలో ముఖ్యంగా 18–24 వయస్సువారు.. 65–74 వయస్సు వారితో పోలిస్తే .. ప్రస్తుతం కంటే దాదాపు నాలుగు రెట్లు బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. అధిక బరువు, ఒబేసిటీ అని వర్గీకరించిన యువతను అధిక బీఎంఐ కేటగిరీకి మారే అవకాశం పుష్కలంగా ఉందట.
అధిక బరువు కేటగిరీ వ్యక్తిగతంగా చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొవిడ్‌ –19 మహమ్మారి కారణంగా స్థూలకాయానికి చేరువవుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

బీఎంఐ మార్పునకు వయస్సు చాలా ముఖ్యం. సోషియోడెమొగ్రాఫిక్‌ కార కల్లో ఇది ఒకటి అని అధ్యయనంలో స్పష్టంగా ఫలితాలు చూపిస్తున్నాయి. వృద్ధులతో పోలిస్తే.. 18–24 ఏళ్ల వయస్సు యువతలో బీఎంఐ పొందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఒబేసిటీ ఉన్న వ్యక్తుల్లో .. పెద్దలతో పోలిస్తే.. 35–54 వయస్సువారు బరువు తగ్గకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉందట. అధిక బరువుకు కేటగిరీకి మారే వ్యక్తిగత బరువును తెలుసుకోవడం ముఖ్యం.
బీఎంఐ మార్పునకు వయస్సు అత్యంత ముఖ్యం. దీంతోనే గణంగాలు కూడా చేపడతారు. అందుకే 18–24 ఏళ్ల యువత పెద్దవారితో పోలిస్తే బీఎంఐ పొందే ఛాన్స్‌ ఎక్కువని ఫలితాలు స్పష్టంగా చూపుతున్నాయి.

యువతకు ఎందుకు ప్రమాదం?
యువత జీవితంలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. అంటే, వారు ఇంటికి దూరంగా ఉంటూ, కాలేజీ లేదా ఆఫీస్‌ పనులకు వెళ్లాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుంచి వారికుండే అలవాట్లు ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారం.

అధ్యయనం..
65–74 వయస్సువారితో పోలిస్తే ..రాబోయే పదేళ్లలో అధిక బీఎంఐ కేటగిరీ నుంచి 4–6 రెట్లు ఎక్కువ 18–24 వయస్సువారు బరువు పెరిగే ప్రమాదం ఎక్కువ. సాధారణ బరువు ..4.6 రెట్లు పెరిగే అవకాశం . అధిక బరువు నుంచి ఒబేసిటీకి 5.9 శాతం నాన్‌ సివియర్‌ ఒబేసిటీ నుంచి సివియర్‌ ఒబేసిటీకి మారతారని తెలిపింది.
Published by:Renuka Godugu
First published:

Tags: Obesity, Weight gain, Youth

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు