కేవలం 10 నిమిషాల్లో క్యాన్సర్‌ను గుర్తించే రక్తపరీక్ష

ప్రత్యేకమైన రసాయనంలో కొన్ని రక్తం చుక్కల్ని కలిపి పరీక్షిస్తారు. డీఎన్ఏలోని రక్తం ఆరోగ్యవంతమైనదైతే ఆ రసాయనంలో మార్పులు కనిపిస్తాయి. రక్తం నీలి రంగులోకి మారుతుంది. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్టైతే రక్తం రంగు మారదు.

news18-telugu
Updated: December 10, 2018, 1:01 PM IST
కేవలం 10 నిమిషాల్లో క్యాన్సర్‌ను గుర్తించే రక్తపరీక్ష
ముఖ్యంగా.. మహిళలపై కొనసాగిన పరిశోధనల్లో.. ఆర్గానిక్ ఫుడ్ తినేవారు.. తినని వారికంటే 25శాతం కంటే తక్కువగా క్యాన్సర్‌ని ఎదుర్కున్నారని తేలింది.
  • Share this:
క్యాన్సర్‌ను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త 'క్యాన్సర్ డిటెక్షన్ కిట్' తయారు చేస్తున్నారు. దాని ద్వారా ఓ పరీక్ష జరిపి కేవలం 10 నిమిషాల్లో క్యాన్సర్‌ని గుర్తించొచ్చు. శరీరంలో ఎలాంటి క్యాన్సర్‌నైనా రక్త పరీక్ష ద్వారా నిర్థారించొచ్చు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ ఈ పరిశోధన చేస్తోంది. పలురకాల క్యాన్సర్స్‌ని ఆలస్యంగా గుర్తించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ క్యాన్సర్ డిటెక్షన్ కిట్ తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కిట్ త్వరలో మార్కెట్‌లోకి వస్తుంది.

క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటుంది. ఖర్చు కూడా ఎక్కువ. స్క్రీనింగ్ ప్రారంభ దశలో ఒక్కోసారి క్యాన్సర్‌ని గుర్తించకపోయే ప్రమాదముంది. కానీ కొత్తగా తీర్చిదిద్దిన రక్త పరీక్షతో క్యాన్సర్‌ని సులువుగా గుర్తించొచ్చు. ప్రత్యేకమైన రసాయనంలో కొన్ని రక్తం చుక్కల్ని కలిపి పరీక్షిస్తారు. డీఎన్ఏలోని రక్తం ఆరోగ్యవంతమైనదైతే ఆ రసాయనంలో మార్పులు కనిపిస్తాయి. రక్తం నీలి రంగులోకి మారుతుంది. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్టైతే రక్తం రంగు మారదు. ప్రస్తుతం నిర్వహిస్తున్నవాటితో పోలిస్తే ఈ పరీక్ష చాలా చౌకైనది. 90 శాతం ఇది ఖచ్చితమైన ఫలితాలనే ఇస్తుంది.

ఈ టూల్ కిట్‌ను ప్రస్తుతం పరీక్షిస్తున్నామని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ పరిశోధకులు మ్యాట్ ట్రావ్ చెబుతున్నారు. అయితే ఇది ఎప్పట్లోగా మార్కెట్లోకి వస్తుందన్నది చెప్పలేనంటున్నారు. శరీరంలో క్యాన్సర్ ప్రారంభ దశను గుర్తించేందుకు ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. స్తోమతతో సంబంధం లేకుండా ఎవరైనా పరీక్షలు జరుపుకోవచ్చు. ఫలితాలు 10 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఇలాంటి పరీక్షల ద్వారా మొదటి దశలోనే క్యాన్సర్‌ని గుర్తిస్తే చాలామంది ప్రాణాలను కాపాడొచ్చు.

ఇవి కూడా చదవండి:

అర్థరాత్రి వరకు మేల్కొంటే గుండెపోటు ఖాయం

Photos: క్యాన్సర్ బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంచే టాటూ

VIDEO: క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?డయాబెటిస్ డే: మధుమేహాన్ని స్మార్ట్‌గా కంట్రోల్ చేయడానికి 5 టిప్స్

Video: డయాబెటిస్ రావొద్దా? ఇలా చేయండి!
First published: December 10, 2018, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading