Cooking Rice: అన్నం వండేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే క్యాన్సర్‌ కొని తెచ్చుకున్నట్టే..

ప్రతీకాత్మక చిత్రం

improper rice cooking is dangerous: దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం అన్నమే.. వరి ఆధారిత ఆహారాన్నే ఎక్కువగా తింటూ ఉంటాం.. అయితే అందులో ముఖ్యమైనది అన్నం.. అయితే అన్నం వండడం అన్నింటికన్నా సులువైన పనే..కానీ సరిగ్గా అన్నం వండుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

 • Share this:
  lifestyle, cooking rice, health benefits, health tips, food habits, అన్నం వండేటప్పుడు, లైఫ్ స్టైల్, అన్నం సరిగ్గా వండకపోతే క్యాన్సర్ సోకే ప్రమాదం, రాత్రే బియ్యం నానబెట్టుకోవడం మంచింది
  Cooking Rice: కోట్ల మంది జనాభా ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో అహారంగా అన్నాన్ని తీసుకోని వారు వందల సంఖ్యలో కూడా ఉండరేమో.. తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణ భారత దేశంలో అందరూ అన్నం తింటున్నవాళ్లే.. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువగా వరి, గోధుమ పండిస్తారు. ఇందులో చాలామంది అన్నం ఆహారంగా స్వీకరిస్తారు.


  దక్షిణ భారతదేశంలో వరి అన్నం లేకుండా భోజనం ఊహించడం కష్టమే. అల్పాహారం నుంచి పిండివంటల వరకు చాలా వంటలలో బియ్యంతో చేసిన పదార్ధాలు కనిపిస్తాయి. పిల్లలకు అన్నప్రాసన చేసేటప్పుడు బియ్యంతో వండిన పదార్థాలనే చాలా ప్రాంతాలలో తినిపిస్తారు. అన్నాన్ని బియ్యం ద్వారా వండుతారు.


  ఇక పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో సైతం బియ్యంతో చేసిన రక రకాల పదార్థాలు వడ్డిస్తారు. ఆలయాలలో దేముడికి సమర్పించే నైవేద్యాలలో, పంచే ప్రసాదాలలో కూడా పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటి బియ్యంతో చేసే పదార్ధాలే ఉంటాయి.


  అయితే అన్నంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఇతర వంటకాలతో పోలిస్తే.. అన్నం వండుకోవడం చాలా సులభం. అయితే బియ్యాన్ని సరైన పద్దతిలో ఉడికించకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరానికి కూడా మంచిదికాదంటున్నారు.


  దక్షిణాదిలో అన్నంతో చేసే పులిహోర, పలావు, కొత్తిమీర అన్నం, కొబ్బరి అన్నం, పుదీన అన్నం, టమాటో అన్నం, వంకాయ రైస్, పొంగలి లాంటి పదార్ధాలు కనీసం 30కి పైగానే ఉంటాయి. ఇక పిండి వంటలలో రకాలలో అయితే లెక్కకు మించి ఉంటాయి.


  ప్రతి రోజూ మనం తినే ఆహారాలు రసాయనాలతో నిండి ఉంటున్నాయని అందరికి తెలుసు. మన జీవనశైలిలో మనకు తెలియకుండానే వీటిని తీసుకుంటున్నాం. అయితే భవిష్యత్‌లో ఇది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.


  ఇంగ్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్శిటీ బెల్‌ఫాస్ట్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. కీటకాల నుంచి వరిని కాపాడటం కోసం, అధిక దిగుబడుల కోసం రైతులు విపరీతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందులను ఉపయోగిస్తున్నారు. ఇది వరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఎఫెక్ట్ వరితో తయారయ్యే బియ్యంపై కూడా పడుతుందని ఆ అధ్యయనం చెబుతోంది.  ఈ బియ్యంతో వండుతున్న అన్నం తినడం కారణంగా ఎంతో కొంత రసాయనాలు మన శరీరంలోకి వెళుతున్నాయని తేల్చారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు. అయితే అన్నం వండటానికి ముందు బియ్యాన్ని సరైన పద్దతిలో ఉడికించాలని సూచిస్తున్నారు.


  అన్నాన్ని సరిగ్గా ఉడకబెట్టకపోతే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాక ఉత్తమమైన మార్గం ఏంటంటే అన్నం వండటానికి ముందు రాత్రిపూట బియ్యాన్ని నీటిలో నానబెట్టడం మంచిది. దీని కారణంగా బియ్యంలో ఉండే టాక్సిన్స్ 80 శాతం తగ్గుతాయని చెబుతున్నారు.


  ప్రకృతిలో సహజంగా లభించే ఏ ఆహార పదార్ధమైనా ఆరోగ్యానికి మంచిదేననీ, కానీ, దానిని ప్రకృతి నుంచి వేరు చేసి తినే ప్రక్రియలో వాటి సహజత్వాన్ని నాశనం చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే పొట్టు తీయని బియ్యం తింటే ఈ సమస్యలకు కొంత వరకు చెక్ పెట్టే అవకాశం ఉండొచ్చు..
  Published by:Nagesh Paina
  First published: