HOME »NEWS »LIFESTYLE »important alert to all about covid tongue the new corona symptoms hsn

Covid Tongue: కరోనా కొత్త లక్షణం.. బయటపెట్టిన శాస్త్రవేత్తలు.. నాలుకపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..

Covid Tongue: కరోనా కొత్త లక్షణం.. బయటపెట్టిన శాస్త్రవేత్తలు.. నాలుకపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..
ప్రతీకాత్మక చిత్రం

తాజాగా కరోనాకు సంబంధించిన ఓ లక్షణం బయటపడింది. కరోనా సోకిన ప్రతీ అయిదుగురిలో ఓ వ్యక్తికి ఈ లక్షణం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాలుకపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..

  • Share this:
    దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. టీకాను తీసుకున్న వారిలో ఏ ఒక్కరికి కూడా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు తేలలేదు. కొన్ని దేశాల్లో టీకాను తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కానీ, మన దేశంలో మాత్రం అలాంటి ఘటనలు జరగలేదు. దీంతో సర్కారు సరఫరా చేస్తున్న టీకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కరోనా లక్షణాలు, దాని ఉదృతిని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు, మరికొంత కాలం కరోనాతో ప్రజలు జీవించక తప్పదని తేల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనాకు సంబంధించిన ఓ లక్షణం బయటపడింది. కరోనా సోకిన ప్రతీ అయిదుగురిలో ఓ వ్యక్తికి ఈ లక్షణం ఉందనీ, అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో ఆ లక్షణం గురించి తాజాగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.

    నాలుక చర్మంపై దుద్దుర్లు రావడం, చర్మం పగిలిపోవడం, నోరు పూతకు గురవడం వంటివి ప్రతీ ఐదుగురు కరోనా పేషెంట్లలో ఒకరికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు జనసమ్మూహంలోకి వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు. లండన్ లోని కింగ్స్ కాలేజీలోని శాస్త్రవేత్తలు ఈ లక్షణం గురించి పరిశోధన చేశారు. కరోనా వచ్చిన వారిలో చాలా మందికి అసలు లక్షణాలే కనిపించడం లేదనీ, వారికి కరోనా సోకిందన్న విషయం కూడా తెలియడం లేదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన లక్షణాల్లో ఏమీ లేకున్నా కూడా కరోనా ప్రభావానికి లోనయిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉందంటున్నారు.





    తాజాగా గుర్తించిన లక్షణానికి కొవిడ్ టంగ్ అనే పేరు పెట్టారు అదే సమయంలో దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా గుర్తించి, కరోనా లక్షణంగా ప్రకటించాల్సి ఉందని లండన్ కింగ్ కాలేజీ వైద్య నిపుణులు చెబుతున్నారు. పళ్లు ఊడిపోవడం, పళ్లు బూడిదరంగులోకి మారిపోవడం, పళ్లపై పగుళ్లు ఏర్పడటం వంటి లక్షణాలు కూడా కరోనా పేషెంట్లలో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ’మానవ శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశానికి నోరు ఓ ప్రధాన మార్గం. అందువల్ల నోట్లో ప్రధానంగా ఉండే నాలుక, పళ్లపై వైరస్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆహార పదార్థాల రుచిని గుర్తుపట్టలేకపోవడం అనేది ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా లక్షణంగా పేర్కొంది. అంటే నాలుకపై వైరస్ ప్రభావం పడుతోందనే అర్థం చేసుకోవచ్చు. తాజాగా వెలుగులోకి వచ్చిన లక్షణాలు కూడా కరోనావే అని పూర్తిగా చెప్పలేము కానీ, ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. ప్రతీ ఐదుగురు కరోనా రోగుల్లో ఒకరికి ఈ లక్షణాలు ఉండటం అనుమానించాల్సిన విషయమే..‘ అని వైద్యులు చెబుతున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 21, 2021, 10:35 IST