హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

International Yoga Day 2021: ఈ పరిస్థితుల్లో ఇదొక్కటే మనల్ని కాపాడేది.. ఆరోజు వచ్చేస్తోంది..!

International Yoga Day 2021: ఈ పరిస్థితుల్లో ఇదొక్కటే మనల్ని కాపాడేది.. ఆరోజు వచ్చేస్తోంది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశ ప్రజలకు యోగా యొక్క విశిష్టతను తెలియజెప్పేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) రోజు మరోమారు దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో సామూహికంగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ యోగా డేను జరుపుకోవాలని సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  ‘బం చిక్ చిక్ భం చెయ్యి బాగా చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా’ అని రమ్యకృష్ణ స్టెప్పులేసి మరీ చెబితే ఆ పాటను చూసిన వాళ్లున్నారు గానీ పాటించిన వాళ్లు తక్కువే. భారత్‌లో ఇప్పటికీ యోగాపై ప్రజల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉందనేది కాదనలేని సత్యం. అయితే.. గత కొన్నేళ్లుగా ఆరోగ్యానికి యోగా చేసే మేలు గురించి, మానసికంగా, శారీరకంగా యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్వయంగా దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుండటం శుభ పరిణామం. దేశ ప్రజలకు యోగా యొక్క విశిష్టతను తెలియజెప్పేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) రోజు మరోమారు దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో సామూహికంగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ యోగా డేను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి.. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటానికి యోగా ఎంతగా ఉపకరిస్తుందో తెలియజెప్పేందుకు ప్రతీ సంవత్సరం జూన్ 21న ‘ ఇంటర్నేషనల్ యోగా డే’ ను జరపాలని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది.


  కరోనా సెకండ్ వేవ్ కారణంగా తలెత్తే మానసిక రుగ్మతలను దూరం చేసేందుకు యోగా కచ్చితంగా సహాయపడుతుందని, అందువల్ల భారత్‌లో ప్రజలంతా యోగా ఔన్నత్యాన్ని గుర్తెరిగి యోగాను ఆచరించాలని ప్రముఖ యోగా గురువులు సూచిస్తున్నారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సమీపిస్తున్న నేపథ్యంలో యోగా విశిష్టత గురించి మరొక్కసారి వివరంగా తెలుసుకుందాం.

  అంతర్జాతీయ యోగా దినోత్సవం- ముఖ్య ఉద్దేశం:

  2021లో జరుపుకోబోతున్న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ భారతీయులకు ఎంతో ముఖ్యమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది భారతీయులు పలు శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిన వారితో పాటు దేశంలో ఈ పరిస్థితులను గమనించి ఆందోళన చెందుతున్న వారు కూడా మానసికంగా కుంగిపోతున్నారు. వైరస్ తమ దాకా వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన చాలామందిలో ఉంది. ఈ ఆందోళనే మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. ఇక.. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల కూడా చాలామందిలో మానసికంగా మార్పులు వచ్చాయనడంలో సందేహం లేదు. అప్పటి దాకా స్వేచ్ఛగా విహరిస్తున్న ఓ పక్షిని పంజరంలో బంధించినట్టుగా పరిస్థితి ఉండటం, గతంలో గడిపిన జీవనానికి భిన్నంగా జీవించాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవడం సహజం. అయితే.. ఆ మానసిక ఒత్తిడి ప్రభావం మరింత పెరిగితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మానసిక రుగ్మతల నుంచి బయటపడేసి, ప్రశాంత జీవనాన్ని కొనసాగించడానికి ఉపకరించే ఒకేఒక్క మార్గం యోగా. ధ్యానాన్ని ఆచరించడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను జయించి ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది.


  కరోనా వంటి ఉపద్రవాలు ఆందోళన కలిగించినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలో యోగా ఒక దారి చూపిస్తుంది. ఐక్యరాజ్యసమితి కూడా అందుకు నడుం బిగించింది. ఐక్యరాజ్య సమితి అధికారిక వెబ్‌సైట్‌లో కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎలా ఉపకరిస్తుందో పొందుపరిచారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కోవిడ్-19 బాధితులు కూడా మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని.. ఈ భయాలను, ఆందోళనలను పోగొట్టేందుకు యోగా ఉపయోగపడుతుందని ఐక్యరాజ్య సమితి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా యోగా వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొంది. యోగా వల్ల ఫిట్‌నెస్, మానసిక ప్రశాంతత దక్కుతాయని తెలిపింది.

  అంతర్జాతీయ యోగా దినోత్సవం- మూలాలు:

  ఆరోగ్యానికి మేలు చేసే యోగా విశిష్టతను, అవసరాన్ని తెలియజెప్పేందుకు.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోతవ్సం’ జరుపుకోవడాన్ని తప్పనిసరి చేయాలని ఐక్యరాజ్య సమితికి తొలుత ప్రతిపాదించింది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే కావడం విశేషం. 2014లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ‘ప్రాచీన భారతం ప్రసాదించిన వెలకట్టలేని బహుమతి యోగా’ అని, ‘ప్రకృతికి, ‘మనిషికి మధ్య సామరస్యాన్ని పెంపొందించేదే యోగా’ అని యోగా విశిష్టతను మోదీ ప్రపంచానికి తెలియజేశారు. భారత ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతు తెలిపాయి. ఈ స్థాయిలో ఒక ప్రతిపాదనకు ఇన్ని దేశాలు మద్దతు తెలపడం ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే అరుదు.

  international yoga day,international yoga day 2019,yoga day,yoga,international yoga day 2019 theme,yoga day 2019,5th international yoga day,international day of yoga,international yoga day celebration,international yoga day celebrations,world yoga day,4th international yoga day,internatonal yoga day,international yoga day 2018,international yoga day date,2019 international yoga day,అంతర్జాతీయ యోగా దినోత్సవం,యోగా స్పెషల్,యోగా డే,యోగాసనాలు,యోగా కేంద్రాలు,యోగా ఎప్పుడు చేయాలి?,యోగా వల్ల లాభాలు,ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం,ప్రధాని మోదీ,మోదీ యోగాసనాలు

  ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసి ఐక్యరాజ్యసమితి జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఆ రోజున భారత్‌లో పాటు పలు ప్రపంచ దేశాలు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని’ ఘనంగా జరుపుతున్నాయి. భారతీయ ఆరోగ్య వర ప్రదాయిని ‘యోగా’ ఔన్నత్యం ప్రపంచ నలుమూలలకూ వ్యాప్తి చెందింది. యోగాలో చాలా రకాలున్నాయి. రాజ యోగ, భక్తి యోగ, కుండలినీ యోగ, కర్మ యోగ, స్వర యోగ, మంత్ర యోగ, హరి యోగ, అష్టంగమంత్ర యోగ.. ఇలా చాలా రకాలుగా యోగాను ఆచరించవచ్చు. ఒక్కో ప్రక్రియ వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Fitness, Lifestyle, Yoga day, Yoga day 2021

  ఉత్తమ కథలు