Home /News /life-style /

IMMUNOTHERAPY SHOWS PROMISE IN FIGHT AGAINST CANCER RA

Health Tips: క్యాన్సర్‌ని నాశనం చేసే థెరపీ.. త్వరలోనే మార్కెట్‌లోకి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్యాన్సర్‌ని పూర్తిగా తగ్గించేందుకు జరుగుతున్న అనేక పరిశోధనల్లో శాస్త్రవేత్తల శ్రమ ఫలించింది. క్యాన్సర్ కనిపెట్టే సరికొత్త ఇమ్యూనో థెరపీని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

క్యాన్సర్ కణాలు ప్రజల ప్రాణాల బలిగొంటున్న నేపథ్యంలో అమెరికాలో శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో కేన్సర్‌ని పూర్తిగా రూపుమాపే ఇమ్యూనో థెరపీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికీ ప్రయోగదశలో ఉన్న థెరపీ త్వరలోనే అన్ని పరీక్షలు పూర్తి చేసుకోనుంది. ఇది గనుక సత్ఫలితాలు ఇస్తే థెరపీని ఈ ఏడాది చివరిలోపు అమెరికాలోని 35 సెంటర్లలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రయోగానికి మూలం..
పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్ జూన్ క్యాన్సర్‌ని కట్టడి చేసే మందుని కనుగొనేందుకు 30సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ప్రక్రియ చివరికీ ఇమ్యూనో థెరపీ అందుబాటులోకి వచ్చింది. ఈ థెరపీకి ఎంతటి శక్తి ఉందంటే.. అత్యంత భయకరమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధిని నియంత్రిస్తుంది.

సాధారణంగా రక్త కేన్సర్ కణాల్లో సీడీ 19 అనే ప్రోటీన్ ఉంటుంది.. దీన్ని తొలగిస్తే కేన్సర్ కణాలు నశిస్తాయి. ఈ ప్రోటీన్ దాడిచేసేందుకు మందులు, కీమోథెరపీలో పనిచేయవు. అందుకు.. కణస్థాయిలోనే చికిత్స చేయాల్సి ఉంటుంది. జూన్ కనుగొన్న థెరపీ.. రోగనిరోధక శక్తిని ఇచ్చే కణాల జన్యువుల్లో మార్పులు తీసుకొస్తుంది. అదే విధంగా ఆ కణాల్లో తయారయ్యే ఓక ప్రొటీన్ సీడీ 19ని అతుక్కొని నిర్వీర్యం చేస్తుంది. ఈ సమయంలో మిగిలిన రోగ నిరోధక కణాలు కేన్సర్ కణంపై దాడి చేసి దానిని చంపేస్తాయి. కేన్సర్ కణాలపై దాడిచేసే ఖనాలను శరీరం తయారు చేసుకోలేదు.. కాబట్టి వాటిని ల్యాబ్‌లో తయారు చేసి రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పటికే ఎలుకలపై చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది.
అయ్యే క్యాన్సర్‌ని కట్టడిని చేసే ఈ థెరపీకి కాస్తా ఖర్చు ఎక్కువే. కోటి రూపాయలతో ఈ థెరపీని చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, రోగనిరోధక శక్తి కణాల తయారీ తగ్గితే ఈ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది.
First published:

Tags: Cancer, Health Tips

తదుపరి వార్తలు