అసలే ఎండాకాలం. అందంగా కనిపించాలని ఏవేవో క్రీమ్లు వాడుకుంటూ డబ్బులు తగలేస్తుంటారు. కానీ, మనం అప్పుడప్పుడు చేసే కొన్ని పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటే (Skin care for boys) మృదువైన (Smooth), అందమైన చర్మం (beautiful skin) మన సొంతమవుతుందని తెలుసా. మనలో చాలా మందికి మెడ, మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం ఎక్కువగా నల్లగా ఉంటుంది. కొందరు తెల్లగా ఉన్నప్పటికీ ఈ భాగాలలో నల్లగా ఉండడాన్ని మనం చూడవచ్చు. కొందరిలో అనారోగ్య సమస్యల వల్ల కూడా మెడ భాగంలో చర్మం నల్లగా మారుతుంది. ఈ భాగాలలో చర్మం తెల్లగా మారడం కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అధిక ధరను వెచ్చించి మరీ మనం రకరకాల క్రీములను కొనుగోలు చేసి వాడుతూ ఉంటాం. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని మనం పొందలేక పోతుంటాం.
మందికి శరీరంలోని కొన్ని భాగాల్లో చర్మం (skin) నల్లబడుతుంటుంది (turn black). ముఖ్యంగా ఎండ, వేడి తగిలే ప్రాంతంలో ఎక్కువగా నల్లబడుతుంటుంది. కొంత మందికి పడటమే కాకుండా మచ్చలు (spots) కూడా ఏర్పడుతుంటాయి. సమస్యలు రాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. అలాగే కొన్ని చిట్కాలు (beauty tips) పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చర్మం నల్లబడకుండా (black spots on skin) ఉండాలంటే మంచి నీళ్లు (water) ఎక్కువగా తాగాలి. కాకుండా తాజా పండ్ల రసాలు (fruit juice), మజ్జిగ (butter milk) తాగుతుండాలి. పుచ్చకాయలు, నల్ల ద్రాక్ష, దానిమ్మ పండ్లు వంటివి ఎక్కువగా తినాలి. బయటకు పోవడానికి అర్ధగంట ముందు సన్ స్క్రీన్ లోషన్ (sun screen lotion) ముఖానికి రాసుకుని బయటికి వెళ్లాలి. ఆ రోజు స్నానానికి 20 నిమిషాల ముందు నల్ల ద్రాక్ష గుజ్జు, తేనె (honey) కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.
ఇంట్లో వాడే పదార్థాలతో మిశ్రమాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిశ్రమం తయారీ కోసం రెండు టీ స్పూన్ల కాఫీ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక సగం చెక్క నిమ్మరసం, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను వేసి కలుపుకోవాలి. దీనిని మెడ భాగం, మోచేతులు, మోకాళ్ల దగ్గర నెమ్మదిగా రాస్తూ మర్దనా చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల నల్లగా ఉండే చర్మం తెల్లగా మారుతుంది. కాఫీ పౌడర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, నిమ్మరసం, గులాబీ నీరులో ఉండే ఔషధ గుణాలు నల్లగా ఉండే చర్మాన్ని తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆయా భాగాల్లో చర్మం తెల్లగా మారుతుంది. మళ్లీ పూర్వ రూపాన్ని పొందుతుంది
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Skin care, Summer