Home /News /life-style /

IF YOUR CHILD MISS ASK THEM TO DO THIS ONE THING RNK

Parenting: పొరపాటున మీ పిల్లాడు తప్పిపోతే.. ఈ ఒక్కపని చేయమని ముందుగానే చెప్పండి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

missing child: మీ పిల్లలకు మీ ఫోన్‌ నంబర్లు కచ్చితంగా తెలిసి ఉండాలి. కనీసం వారికి రెండు కాంటాక్ట్‌ నంబర్లు అయినా తెలిసి ఉండాలి.

మీరు కొత్త పేరెంట్‌ అయినా.. ఓల్డ్‌ పేరెంట్‌ అయినా.. మీ పిల్లాడు పొరపాటున తప్పిపోతే  (missing) అది మీరు జీర్ణించుకోలేరు. ఈ విషయంపై ఏవేవో తెలియని ఆలోచనలు చేయకుండా వెంటనే స్పందించాలి. ఒక వేళ మీ పిల్లలు  (children) జనాల్లో తప్పిపోతే మనకు ఏమీ అర్థం కాదు. అంతా గందరగోళంగా అనిపిస్తుంది.

అందుకే ముందుగానే ప్లాన్డ్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక ప్రత్నామ్నాయ ప్లాన్‌ను రెడీగా పెట్టుకోవాలి. ఎలా స్పందించాలి? ఏం చేయాలి? అని పిల్లలకు కూడా తెలియజేయాలి.

ఎప్పుడూ రెడీగా..
ప్రతి పిల్లలకు వారు తప్పిపోతే ఏం చేయాలో? ఎవరికి చెప్పాలి? ఇంటికి మళ్లీ తిరిగి రావడానికి పేరెంట్స్‌ను ఎలా కాంటాక్ట్‌ అవ్వాలో మనం ముందుగానే వారిని సిద్ధం చేసి పెట్టాలి. అవేంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి:  ఈ ఫుడ్‌ తినడం వల్ల మీ బోన్స్‌ ఏం అవుతాయో తెలుసా?


ల్యాండ్‌మార్క్స్‌..
మీ ఇంటికి దగ్గర్లో ఉన్న పెద్ద బిల్డింగ్స్, చెట్లు ఇతర వాటిని వారు గుర్తుపెట్టుకునేలా చూడాలి. ఎప్పుడైనా వారితో మీరు బయటకు వెళ్లినప్పుడు వారికి మీరు చెప్తూ ఉండాలి. గుడి, చర్చీ ఇతర వాటిని కూడా చెప్పాలి. దీంతో వారికి మీ ఇంటి పరిసరాలపై అవగాహన కలుగుతుంది.

పేరెంట్స్‌ను గుర్తించడం..
పిల్లడికి నేర్పించాల్సిన మరో విషయం ఏంటంటే.. వారు తప్పిపోయినప్పుడు ముందుగా వారి పేరెంట్స్‌ను గుర్తించాలి. వారు ఎలా ఉంటారు. ఏ పని చేస్తారు? పేర్లు వంటివి వారికి కచ్ఛితంగా చెప్పాలి. ఇది పిల్లలు మళ్లీ ఇంటికి తిరిగి రావడానికి సులభతరం చేస్తుంది.

ఫోన్‌ నంబర్స్‌..
మీ పిల్లలకు మీ ఫోన్‌ నంబర్లు కచ్చితంగా తెలిసి ఉండాలి. కనీసం వారికి రెండు కాంటాక్ట్‌ నంబర్లు అయినా తెలిసి ఉండాలి. అప్పుడే ఇటువంటి ఎమర్జెన్సీ సమయంలో వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారు తప్పిపోయినప్పుడు ఇతరులతో అయినా నంబర్లు డయల్‌ చేయించగలుగుతారు.

ఇది కూడా చదవండి:   బ్రెయిన్‌ హెల్తీగా ఉండటానికి ఈ ఫుడ్‌ తినండి!


ఫోన్‌బూత్‌..
మన దేశంలో ఫోన్‌ బూతుల సంఖ్య దాదాపు తగ్గిపోయింది. కానీ, వారికి ఎవరిని ఫోగ్‌ అడగాలో వారికి నేర్పించాలి.

పోలీస్‌..
సాధారణంగా క్రౌడ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా వ్యాన్లు కచ్చితంగా ఉంటాయి. పిల్లలకు పోలీసులను లేదా సెక్యూరిటీ సిబ్బందిని ఎలా గుర్తించాలో చెప్పాలి. వారి సహాయం తప్పకుండా కోరాలని ముందుగానే చెప్పాలి.
Published by:Renuka Godugu
First published:

Tags: Parenting

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు