హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

Health tips: శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన శరీరమే (body) మనకు దుర్వాసన కలుగజేస్తే. అది భరించలేం. మన దగ్గరికి రావడానికి కూడా చాలామంది ఇష్టపడరు (Not interested). చెమట (sweat) పడితే ఎంతో కొంత శరీరం నుంచి దుర్వాసన (pong) వస్తుంది అది సహజమే. కానీ కొందరికి నిరంతరం శరీరం నుండి ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది.

ఇంకా చదవండి ...

దుర్వాసన (pong) ఎవరూ కోరుకోనిది. ఏదైనా చనిపోయిన (died) కళేబరం దగ్గరైనా.. ఏదైనా పదార్థం ఎక్కువరోజులు ఉన్నదైనా ఇలా ఏదైనా సరే దుర్వాసన (stink)కు కారణం అవుతుంది. అయితే అదే మన శరీరమే (body) మనకు దుర్వాసన కలుగజేస్తే. అది భరించలేం. మన దగ్గరికి రావడానికి కూడా చాలామంది ఇష్టపడరు (Not interested). చెమట (sweat) పడితే ఎంతో కొంత శరీరం నుంచి దుర్వాసన (pong) వస్తుంది అది సహజమే. కానీ కొందరికి నిరంతరం శరీరం నుండి ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. రోజుకు ఒకటికి రెండు మూడు సార్లు స్నానం చేసినా... గంటల తరబడి సబ్బులతో కుస్తీలు పడినా.. కాసేపు ఫ్రెష్ (fresh) గా ఉంటారు. కానీ మళ్ళీ ఆ దుర్వాసన మిమ్మల్ని చుట్టేస్తుంది. ఇలాంటి వారు కొన్ని చిట్కాలను (tips) పాటిస్తే దుర్వాసన నుంచి కాస్త విముక్తి పొందొచ్చు.

అవాంఛిత రోమాలు వద్దు..

దుర్వాసన దూరం చేయడానికి రకరకాల పౌడర్లు (powders), బాడీ స్ప్రే లు వినియోగించి.. వినియోగించి విసిగిపోయి ఉంటారు. మీరంతా ఈ పద్దతులు (remedies) పాటించండి. ముందుగా అటువంటి వారు శరీరంపై అవాంఛిత రోమాల (Unwanted hairs)ను ఎప్పటికప్పుడు పెరగకుండా (not grown) తొలగించుకుంటూ ఉండాలి.

టీ, కాఫీలకు దూరం..

టీ (Tea), కాఫీ (coffee)లు శరీరం నుంచి ఎక్కువ చెమట ఉత్పత్తి అవడానికి ముఖ్య కారకాలు ముందుగా కాఫీ.  కావున కాఫీని తరచూ తాగడం మానేయండి. స్నానం చేయాలనుకునే నీటిలో కొద్దిగా పుదీనా వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం ఎక్కువ సేపు తాజాగా ఉండి, దుర్వాసన రాకుండా కాపాడుతుంది.

ఇది చర్మ సౌందర్యానికి (skin beauty) కి కూడా బాగా ఉపయోగపడుతుంది. స్నానం చేసే బకెట్​ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె (honey)ను తీసుకుని బాగా కలపాలి, ఆ తేనె కలిపినటువంటి నీటితో స్నానం చేస్తే ...అంత ఈజీగా చెమట పట్టదు. ఎక్కువ సేపు చెమట పట్టకుండా ఉంటుంది. ఒకవేళ చెమట పట్టిన అంతగా దుర్వాసన రాకుండా ఉంటుంది.

నోటి దుర్వాసనకు..

ఉదయాన్నే పళ్లు తోముకునేటప్పుడు నాలుక (Tongue)ను కూడా టంగ్​ క్లీనర్ తో శుభ్ర పరచడం (cleaning) మరిచి పోవద్దు. అన్నాశయం లోని పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన (bad smell) గల వాయువులను ఏర్పరుస్తుంది. ఇవి నోటినుండి బయటకు (out) వదలబడతాయి. దాంతో నోటి దుర్వాసన (Mouth bad smell) వస్తుంది. మనం తిన్న ఆహారంలో కొంత భాగం నాలుకపై పేరుకుపోతుంది. ఇది కూడా దుర్వాసనకు కారణం అందుకే నాలుకను శుభ్ర పరుచుకోవడం ఉత్తమం.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

First published:

Tags: Coffee, Dead body, Health Tips, Honey, Life Style

ఉత్తమ కథలు