Home /News /life-style /

hair fall treatment: చలికాలంలోనూ మీ జుట్టు సిల్కీగా, షైనీగా ఉండాలా? అయితే ఈ పద్దతి ఫాలో అయిపోండి

hair fall treatment: చలికాలంలోనూ మీ జుట్టు సిల్కీగా, షైనీగా ఉండాలా? అయితే ఈ పద్దతి ఫాలో అయిపోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన జుట్టు రాలిపోవడం, తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair fall treatment) మంచి ఫలితాలను ఇస్తాయి.

ఇంకా చదవండి ...
    శీతాకాలం మొదలైపోయింది. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు చలికాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలూ వేధిస్తుంటాయి. చలికాలం మొదలు కాగానే తేమ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల తలమీది చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మనిషి అందాన్ని వారి కేశాల (hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(fall) జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే (hair fall) విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (black hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు (health issues) వలన జుట్టు రాలే (hair fall) సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన జుట్టు రాలిపోవడం, తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (hair fall treatment) మంచి ఫలితాలను ఇస్తాయి.

    మాడు నుంచి తేమ ఆవిరైపోవడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. అందుకే జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం మంచిది. చాలా మంది ప్రజలు చర్మ సంరక్షణపై దృష్టి సారిస్తారు కానీ జుట్టు గురించి పట్టించుకోరు. చలికాలంలో వెంట్రుకలు పెళుసుగా మారడం వల్ల తలపై దురద పెడుతుంది. ఆ తర్వాత జుట్టు కాంతి హీనంగా మారుతుంది.

    డికాషన్ స్ట్రాంగ్..

    రెండు కప్పుల నీటిని మరిగించి అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ (coffee powder) వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. డికాషన్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది చల్లారాక అందులో కొద్దిగా హెయిర్ కండిషనర్ వేయండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు మీద స్ప్రే చేస్తూ జుట్టు అంతా ఈ మిశ్రమం తో కవర్ చేయండి. ఒక గంట అలాగే వదిలేయండి. ఆ తరువాత చల్లని నీటితో హెయిర్ వాష్ (hair wash) చేసేసుకోండి.

    జుట్టుకి చక్కటి నేచురల్ కండీషనర్..

    ఇక తేనె (honey) కేవలం చర్మానికి మాత్రమే కాకుండా జుట్టు (hair) కి కూడా చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుందనే చెప్పాలి. ఇది నిజంగా జుట్టుకి చక్కటి నేచురల్ కండీషనర్ గా పని చేస్తుంది. ఇక దీనిని తల మీద రాసుకోవడం వల్ల జుట్టు ఎంతో హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మన మాడు కూడా డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇక అంతే కాదండీ జుట్టు మీద దీనిని ప్రతి రోజు రాయడం వల్ల మీ జుట్టు సిల్కీగా షైనింగ్ (silky and shining) గా మెరుస్తూ ఉంటుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Hair fall, Honey

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు