Weight loss tips: బరువు తగ్గాలనుకునేవారు జిమ్​లో ఆ ఒక్క వ్యాయామం మాత్రం చేయకండి.. ఎందుకంటే

ప్రతీకాత్మక చిత్రం

వ్యాయామాలు (exercises) చేయడానికి ఉబకాయం, ఇతర వ్యాధులు (disease) ఉన్న వారు వైద్యుల సలహా తప్పనిసరి తీసుకోవాలి. అయితే జిమ్​లో బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కార్డియో (cardio)కు దూరం ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు..

  • Share this:
    వ్యాయామాలు (Exercise) చేయడం ద్వారా శరీరం ఫిట్‌ (Fit) గా ఉంటుంది. ఈ రోజుల్లో సమయానికి తినకపోవడం వల్ల అధిక బరువు (weight) సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గించుకోవాలని (weight loss) చాలా ప్రయత్నాలే చేస్తారు. జిమ్ (gym)​ లకు వెళ్లడానికి సమయం ఉండదు. అయితే జిమ్‌ (gym)కి వెళ్లడం ఇష్టం లేక కొందరు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టరు. వ్యాయామం (exercise) చేయాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. నిత్యం ఇంట్లోనే ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ జిమ్‌ (gym)లో వ్యాయామం చేసినా ఫలితాలు పొందొచ్చు. మీ ఇంట్లోనే ఉదయం, సాయంత్రం (evening) కొంత సమయాన్ని కేటాయించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం ప్రారంభించడానికి ముందు కనీసం 7 నిమిషాల వార్మప్ (warm up) చేయండి. ఆ తర్వాత కొన్ని ప్రాథమిక స్ట్రెచెస్ చేయండి. అయితే, ఈ వ్యాయామాలు (exercises) చేయడానికి ఉబకాయం, ఇతర వ్యాధులు (disease) ఉన్న వారు వైద్యుల సలహా తప్పనిసరి తీసుకోవాలి. అయితే జిమ్​లో బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కార్డియో (cardio)కు దూరం ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు..

    గుండె ఆరోగ్యానికి..

    కార్డియో (cardio) అనేది చేయడం వల్ల ఖచ్చితంగా గుండె ఆరోగ్యానికి ( heart health) ఎంతో మేలు కలుగజేస్తుందట. బరువు తగ్గడం (weight loss) కోసం కార్డియో (cardio) మీద ఆధారపడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు... కార్డియో చేయడం వల్ల రోగనిరోధక శక్తి (immunity system) పెరిగి శరీరంలో కూడా కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుంది.. కానీ చాలా మందిలో ఎదురు దెబ్బలు కూడా తగిలే ప్రమాదం ఉంటుందట.. ఇక కార్డియో గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.

    చాలామంది కార్డియో (cardio) చేయడం వల్ల శరీరంలోని క్యాలరీ (calories)లు తగ్గిపోతాయి అని అనుకుంటారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు.. ఎందుకంటే శరీరం (body)లో కేలరీలు తగ్గకపోగా మనకు ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల మనలో చాలామంది కేలరీలు బాగా ఖర్చయ్యాయి అని ఊహించుకుంటారు. కార్డియో చేయడంవల్ల ఆకలి (hungry) ఎక్కువగా వేయడంతో మన మనస్సు కూడా తిండి వైపే మళ్ళి ఇక బరువు తగ్గాలనే ఆలోచన కూడా కోల్పోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే  బరువు (weight)ను చూసుకుంటూ అధిక బరువు (weight loss) ను తగ్గించుకోవడానికి కార్డియో చేస్తున్నారో అలాంటి వాళ్ళు ప్రయోజనమేమి పొందక నిరాశకు గురి అవుతారు.. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు జిమ్లో కార్డియో మాత్రం చేయకండి.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: