Home /News /life-style /

IF YOU WANT TO OVERCOME OVER WEIGHT PROBLEM THEN THIS INGREDIENT FOUND IN OUR HOME IS ENOUGH TO USE IN YOUR DIET KNOW THE FULL STORY HERE PRV

Weight loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే మన ఇంట్లో దొరికే ఈ పదార్థం మీ ఆహారంలో వాడితే చాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి.. అయితే మన ఇంట్లో దొరికే ఈ పదార్థం మనం ఆహారంలో అప్పడుప్పుడైనా తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు (weight loss). అవే మిరియాలు (Pepper). దాని గురించి ఓ లుక్కేద్దాం..

ఇంకా చదవండి ...
    అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు. బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి.. అయితే మన ఇంట్లో దొరికే ఈ పదార్థం మనం ఆహారంలో అప్పడుప్పుడైనా తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు (weight loss). అవే మిరియాలు (Pepper). దాని గురించి ఓ లుక్కేద్దాం..

    ఒక చక్కటి పరిష్కారం..

    మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన వ్యాధినిరోధ శక్తి అనేది పెరుగుతుంది. మిరియాలను (Pepper) సుగంధ ద్రవ్యాల్లో ఒకదానిగా పరిగణిస్తారు. మన వంటిటి దినుసులలో, మసాలలో మిరియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి వంటకంలోనూ కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తింటే చాలా మంచిది. అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి వారికి మిరియాలు (Pepper) ఒక చక్కటి పరిష్కారాన్ని ఇస్తాయి.

    జీవక్రియను వేగవంతం చేసి..

    మిరియాలు (Pepper) తినడం వలన శరీరంలో కొవ్వు ఎక్కువుగా పేరుకుపోకుండా చేసి శరీరంలో స్వేద ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఫలితంగా చెమట రూపంలో కొవ్వు కరిగిపోతుంది. అలాగే మిరియాలు మూత్ర విసర్జనను  సాఫీగా జరిగేలా చేస్తాయి. అలాగే మిరియాలు శరీరంలోని  కొలెస్ట్రాల్  జీవక్రియను వేగవంతం చేసి మంచి కొలెస్ట్రాల్  స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంతే కాకుండా మిరియాలలో కొవ్వును కరిగించే గుణాలున్నాయి కాబట్టి ఒక నాలుగు ఐదు మిరియాలు తీసుకుని వాటిని తమలపాకు ఆకులలో  పెట్టుకుని ప్రతి రోజు మెత్తగా నమిలి మింగితే కనుక అధిక బరువు తగ్గుతుంది.అలాగే బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరు ఉదయాన్నే తేనె, నిమ్మరసంను గోరు వెచ్చని నీటిలో తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అలా తాగేవారు వాటితో పాటు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని తాగి చూడండి ఇలా మిరియాల పొడి తాగడం వలన అధిక బరువు తగ్గుతారు.

    బ్లాక్ పెప్పర్ ఆయిల్‌..

    మార్కెట్లోకి బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ కూడా అందుబాటులోకి వచ్చింది కావున  ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఒక చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను వేసి తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు అందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.అయితే బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశ్యంతో మిరియాల పొడిని అధికంగా తీసుకుంటే జీర్ణశయా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో దొరికే మిరియాల పొడిని కల్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున మీరే ఇంట్లో మిరియాల పొడిని తయారు చేసుకుని డబ్బాలో నిల్వ ఉంచుకోండి.

    వృద్ధులు..

    స్థూలకాయులైన వృద్ధులు ఏరోబిక్ వ్యాయామం చేస్తూ రోజువారీ కేలరీ(calories)లలో కొంచెం తగ్గించడం వల్ల బృహత్ ధమని గట్టిగా అవుతుందట. అయితే కేవలం వ్యాయామం ఒక్కటే చేసిన వారితో పోలిస్తే... వ్యాయామం, ఆహారంలో కేలరీల సంఖ్య తగ్గించడం ఈ రెండూ చేసిన వారిలో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ayurvedic health tips, Health Tips, Weight loss

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు