Home /News /life-style /

IF YOU WANT TO LOOSE WEIGHT EASILY THEN BEFORE THAT YOU MUST UNDERSTAND FEW THINGS AND TAKE THIS PRECAUTIONS FOR THAT PRV

weight loss tips: బరువు ఈజీగా తగ్గాలని ట్రై చేస్తున్నారా? అయితే అంతకంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది ఈజీగా బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అంతకంటే ముందు కొన్ని విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ టిప్స్ (Weight loss tips)​ పాటిస్తే మీరు బరువు సులభంగా తగ్గవచ్చు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    వేళకు ఆహారం (food) తినకపోవడం కారణంగా అనారోగ్య (Unhealthy) సమస్యలు మెండుగా వస్తాయి. మళ్లీ వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా అనారోగ్యానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం రోజు తినే ఆహారంలో (food) గానీ, తినే సమయం (Time) గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

    ప్రతీ ఒక్కరికి బరువు (weight) అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు (exercises) చేయడం మంచిదని సలహాలు (weight loss tips) ఇస్తుంటారు. అయితే దానికోసం ర‌క‌ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం మొద‌లు పెడ‌తారు.  చాలామంది ఈజీగా బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అంతకంటే ముందు కొన్ని విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ టిప్స్ (Weight loss tips)​ పాటిస్తే మీరు బరువు సులభంగా తగ్గవచ్చు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..

    ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క డైట్ (Diet) పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకొనే డైట్ మన ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. మనం సరైన ఆహారం తీసుకోకపోతే మన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే మీరు తీసుకునే ఆహారం సరైనదా (healthy food) కాదా మీకు మేలు చేస్తుందా లేదా అనేది చెప్పారు. వీటిని కనుక మీరు చూశారంటే కచ్చితంగా మీరు మంచి ఆహారం తింటున్నారో లేదో తెలిసిపోతుంది.

    ఆహారం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఉండాలి. అంతే కానీ కొలుచుకుంటూ తీసుకోవడం వల్ల మంచిది కాదని న్యూట్రీషన్లు చెప్పారు.  చాలా మందికి స్పైసీ ఆహారం తీసుకోవడం అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు ఎప్పుడు చూసినా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఎక్కువ స్పైసెస్ మీ ఫుడ్‌లో ఉన్న సరే అది మంచిది కాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేగాని ఆరోగ్యం బాగోదు అని గమనించాలి.

    చాలా మంది ఏం చేస్తారంటే నిపుణుల సలహా (Expert advice) తీసుకోకుండా ఎవరికైనా రాసిన డైట్ ప్లాన్‌ని తీసుకుని వాళ్ళు కూడా దానిని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇది నిజంగా మంచి పని కాదు. మిమ్మల్ని చూసి డైటీషియన్ మీ యొక్క డైట్ ప్లాన్ ని రాస్తారు. అంతే కానీ ఇతరులకు రాసిన ప్లాన్ ని మీరు ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు తగ్గడం పెరగడం అనేది గ్రాడ్యుయెల్‌గా జరగాలి. అంతే కానీ సడన్‌గా జరిగిపోవడం మంచిది కాదు కాబట్టి ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకోవడం మంచిది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Weight loss tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు