హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health tips: తిన్న ఆహారం సరిగ్గా అరగట్లేదా? అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది

Health tips: తిన్న ఆహారం సరిగ్గా అరగట్లేదా? అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది

మీకు కడుపు నొప్పి, అజీర్ణం ఉంటే అల్లం టీ (ginger tea) తాగండి. అల్లం టీ తాగడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. దీని కోసం ఒక కప్పు నీటిలో కొన్ని తురిమిన అల్లం వేసి మరిగించి రుచికి అనుగుణంగా ఉప్పు, తేనె వేసి టీని ఫిల్టర్ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)

మీకు కడుపు నొప్పి, అజీర్ణం ఉంటే అల్లం టీ (ginger tea) తాగండి. అల్లం టీ తాగడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. దీని కోసం ఒక కప్పు నీటిలో కొన్ని తురిమిన అల్లం వేసి మరిగించి రుచికి అనుగుణంగా ఉప్పు, తేనె వేసి టీని ఫిల్టర్ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)

జీర్ణ వ్యవస్థ (digestive system)ను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతాయి. అయితే తిన్న ఆహారం (food) బాగా అరగాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంట. వాటి గురించి తెలుసుకుందాం..

ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం (health) కాపాడుకోవడమే గగనంలా మారిపోయింది. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలనూ మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు. ఏ సమయాల్లో తింటారో (eat) తెలియదు. అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు (digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి జేబులు గుల్ల చేసుకుంటారు. మళ్లీ అదే జీవితంలోకి అడుగుపెడుతారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో (food) కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు (health problems) దరిచేరవు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు (digestive problems) తెచ్చుకోకూడదు. పోషకాలు బాగా ఉండే ఆహారం (food) తినండి. పుష్కలంగా నీరు తాగండి (drink). అయితే జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కావలసిన కొన్ని ఆహార పదార్థాలు (food items) విరివిగానే లభిస్తాయి. అవి జీర్ణ వ్యవస్థ (digestive system)ను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతాయి. అయితే తిన్న ఆహారం (food) బాగా అరగాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంట. వాటి గురించి తెలుసుకుందాం.. అనారోగ్యాన్ని(unhealthy) దూరం చేసుకుందాం.

ఆహారంలో షుగర్ పాత్ర..

జీర్ణ సమస్యలు తగ్గించుకోవాలంటే తియ్యని (sweet) పదార్థాలకు కొంచెం దూరం ఉంటే మంచిది. మన ఆహారంలో షుగర్ పాత్ర ఎక్కువైపోతోంది. తియ్యని పదార్ధం కాకపోయినా కూడా షుగర్ (sugar) ఉంటోంది. సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లో షుగర్ ఎక్కువగానే ఉంటుంది. వీటిని తగ్గించడం అవసరం. అలాగే, ఆర్టిఫిషియల్ స్వీటెర్నర్స్ కూడా గట్ హెల్త్ కి మంచిది కాదు. శరీరం ఒక బయలాజికల్ క్లాక్ ని ఫాలో అవుతుంది. ఈ క్లాక్ ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుంది, అరుగుదల, నిద్ర (sleep) వంటి వాటిని నియంత్రిస్తూ ఉంటుంది.

రోజూ మెంతులు..

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటివి చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అధికబరువుతో బాధపడేవారు రోజూ మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవాలి. దీనివల్ల సమస్య అదుపులో ఉండడమే కాక.. అదనపు లాభాలుంటాయి (additional benefits). జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కడుపులో (In stomach) ఆమ్లత్వం ఉంటే, ప్రతిరోజూ రెండు నుండి మూడు తులసి ఆకులను (basil leaves) నమలండి. కొబ్బరినీళ్లు తులసి ఆకులు , నిమ్మరసం కలిపి తాగితే కడుపునొప్పి (stomach pain) నుంచి ఉపశమనం లభిస్తుంది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి:  మీ మోకాళ్ల అందం తగ్గిపోతుందా? నల్లగా మారుతున్నాయా? అయితే ఇలా చేసి సమస్య దూరం చేసుకోండి

First published:

Tags: Health Tips

ఉత్తమ కథలు