IF YOU USE THIS TOMATO PACK YOU WILL GET RID OF PIMPLES ON YOUR FACE THEN FOLLOW THESE TIPS PRV
beauty tips: మీ ముఖంలో అధికంగా మొటిమలు ఉన్నాయా? అయితే ఈ టమాటా ప్యాక్ వాడితే మొటిమలు మాయం
ప్రతీకాత్మక చిత్రం
అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటి కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు. అందులో ఒకటే టమాట
కొంతమంది ఎంత ప్రయత్నించినా, ఎన్ని క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడినా తమ చర్మం(skin) జిడ్డు(oily)గా ఉంటుందని బాధపడుతుంటారు. అలాంటివారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే ముఖం(face) కాంతివంతగా మారుతుంది. జిడ్డుగల చర్మం(skin) ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్(face wash) తో తప్పనిసరిగా శుభ్ర పరుస్తారు. అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటి కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు. అందులో ఒకటే టమాట (tomato).. దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వొచ్చో చూద్దాం..
విటమిన్ సి..
టమాటా(tomato) లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగు (skin color)ని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు (pimples) వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇందుకోసం కొన్ని ప్యాక్స్ వాడొచ్చు. ముందుగా రెండు చెంచాల టమాట గుజ్జు తీసుకోవాలి.. ఇందులో కాస్తా తేనె కలపాలి.. ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగా ముఖం, మెడని శుభ్రం చేసుకుని ముఖం (face)పై రాయాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.
ముఖానికి పూతలా..
కాసింత శనగ పిండిని తీసుకోండి. అందులో ఇప్పుడు టమాట (tomato) గుజ్జుని అందులో కలపాలి. మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖానికి పూతలా వేయాలి. ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్‌లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది. ముఖ రంగుని మెరుగుపరచడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు కాస్తా ముల్తానీ మట్టి తీసుకోండి. అందులో టమాట జ్యూస్ (tomato juice) వేసి బాగా కలపండి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖంపై వేసుకోండి.. చల్లని నీటితో కడగండి.. ఇలా చేయడం వల్ల చాలా వరకూ తగ్గుతుంది. ఎండకు కమిలిన చర్మాన్ని (skin) తిరిగి అందంగా మార్చడంలో టమాటా (tomato) బాగా పనిచేస్తుంది. కొద్దిగా టమాట రసం తీసుకుని అందులో కాస్తా మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కాస్తా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రాయడం వల్ల ట్యాన్ (tan) సమస్య తగ్గుతుంది.
టమాట గుజ్జులో ఏం కలపకుండా అది మాత్రమే ముఖం, మెడకు రాసి ఆరిన తర్వాత కడిగినా మంచి ఫలితముంటుంది. ఇది నేచురల్ రెమిడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల కేవలం మచ్చలు తగ్గడమే కాకుండా.. అందంగా మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.