Home /News /life-style /

IF YOU USE THIS PAPAYA PACK MIXED WITH HONEY PACK FOR YOUR FACE THEN IT WILL GLOSSY PRV

Beauty tips: మీ చర్మం నిగనిగలాడేలా? అయితే ఈ తేనెతో కలిపిన బొప్పాయి ప్యాక్​ను వాడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందం (beauty). ఈ రోజుల్లో దీనికోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసే వారున్నారంటే నమ్మాల్సిందే. సమాజంలో మంచి గుర్తింపు కోసమో.. బంధువుల దగ్గర మెప్పు కోసమో.. ప్రయత్నిస్తూ తెలిసీ తెలియని ఫేస్​ప్యాక్​లను వాడుతుంటారు.

    అందం (beauty). ఈ రోజుల్లో దీనికోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసే వారున్నారంటే నమ్మాల్సిందే. సమాజంలో మంచి గుర్తింపు కోసమో.. బంధువుల దగ్గర మెప్పు కోసమో.. ప్రయత్నిస్తూ తెలిసీ తెలియని ఫేస్​ప్యాక్​లను వాడుతుంటారు. అయితే మన ఇంట్లో చేసుకునే కొన్ని ప్యాక్​లు మన చర్మాన్ని (skin) సంరక్షిస్తాయి. మన చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి (glow brighter) తోడ్పడుతాయి.

    టాన్ ని తొలగించడానికి..

    చర్మ నిగారింపు కోసం తేనె-బొప్పాయి ప్యాక్ (Honey-papaya pack) చాలా మంచిది. ఎందుకంటే బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ టాన్ ని తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. కొద్దిగా బొప్పాయి గుజ్జుకు తేనెను కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ఆ మిశ్రమాన్ని ముఖం (face) ఇంకా ఇతర చర్మం (skin) పై పూయండి. ఇక ఆరిన తర్వాత శుభ్రంగా కడగండి. ఇక చర్మానికి మంచి నిగారింపు అనేది ఉంటుంది. అలానే నిమ్మకాయ (lemon) రసానికి కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి బాగా అప్లై చేసి ఒక 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.ఇక ఇందులో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక తేనె (honey) చర్మాన్ని మృదువుగా చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.

    ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్..

    ఇక నేరుగా తాకే ఎండ వల్ల చర్మం బాగా దెబ్బ తింటుంది (damage). అందువల్ల చర్మం అడుగున ఉండే కొల్లాజెన్‌ అనేది బాగా దెబ్బతిని ఇంకా తరిగిపోయి చర్మానికి ముడతలు అనేవి ఏర్పడతాయి. ఇక అంతేకాదు సూర్యరశ్మి ధాటి నుంచి చర్మం తనను తాను కాపాడుకోవడం కోసం చర్మం క్రమక్రమంగా మందంగా మారడం జరుగుతుంది. అలా మందం పెరిగేకొద్దీ మీ చర్మం (skin)  అనేది ముడతలుగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ (sunscreen lotion) అప్లై చేసుకోండి.

    గంధంతో తయారైన ఫేస్‌ పౌడర్లతో..

    గంధంతో తయారైన ఫేస్‌ పౌడర్ల (face powders) వల్ల కూడా చర్మం బాగా నల్లగా మారడం జరుగుతుంది. అలాగే సన్‌ ట్యాన్‌ (sun tan)కు గురయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఇలాంటి పౌడర్లతో ఉంటాయి. కాబట్టి సన్‌ ట్యాన్‌కు లోనైతే చర్మం (skin) పై ముడతలు అనేవి మొదలవుతాయి. కాబట్టి శాండిల్‌వుడ్‌ బేస్‌డ్‌ పౌడర్లకు చాలా అంటే చాలా దూరంగా ఉండటం మంచిది.ఇక సబ్బు కూడా చర్మం మీద వుండే మురికిని వదిలించాలి గానీ సహజ నూనెలను మాత్రం అస్సలు తొలగించకూడదు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Beauty tips, Skin care

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు