Home /News /life-style /

Hair problem: మీ జుట్టు రాలిపోతుందా.. ఈ పూలను వాడితే మీ జుట్టు పెరగడం ఖాయం..

Hair problem: మీ జుట్టు రాలిపోతుందా.. ఈ పూలను వాడితే మీ జుట్టు పెరగడం ఖాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు, జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    ఈ రోజుల్లో మనిషి అందాన్ని వారి కేశాల(hair)ను బట్టి కూడా అంచనా వేస్తున్నారు. చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(fall) జరుగుతుంది. జుట్టు(hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్లజుట్టు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె(oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు(hair) అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం, షాంపూలు, హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై చేయరు. దానివలన తలలో చర్మం పొడిబారి చుండ్రు, జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

    మనం స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక పావులీటరు కొబ్బరినూనె(oil) వేసుకోవాలి.  నూనెలో ఒక చెంచా మెంతులు చేసుకోవాలి. మెంతులు జుట్టు మృదువుగా, పొడవుగా పెరగడానికి జుట్టు కుదుళ్లను పటిష్టం చేయడానికి ఉపయోగం. తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు విత్తనాలలో విటమిన్ ఈ ఉంటాయి. ఆవాలు విత్తనాల స్థాయిలో ఉన్న కొవ్వు ఆమ్లాలు, మీ నిస్తేజమైన ప్రాణంలేని తంతువులలో జీవాన్నీ ప్రేరేపిస్తాయి. బీ విటమిన్లు మీ జుట్టుకు ఒక అందమైన మెరుపు ఇవ్వడానికి సహాయం చేస్తాయి కూడా. సేబాషియస్ గ్రంధుల ఉత్పత్తి నియంత్రించడానికి సహాయపడతాయి. ఇందులో ఒక పది లవంగాలు, ఒక ఇంచు అల్లం ముక్కను తురిమి వేసుకోవాలి. లవంగాలు వాడటం వలన చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. ఫ్లైట్ స్కాల్ప్ ఇరిటేషన్స్ తగ్గిస్తుంది. ఆకాలంగా వచ్చే బూడిద రంగు జుట్టును నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఎర్రటి రేఖ మందారపువ్వులు, ఆకులను కూడా వేసుకోవాలి. పురాతన కాలం నుంచి మందార ఆకులు(Hibiscus leaves) సౌందర్య రక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు జుట్టు నల్లగా ఉండేలా, కుదుళ్లను బలంగా చేస్తాయి. ఈ నూనెను బాగా మరిగించాలి. నూనె రంగు మారగానే నూనెను వడకట్టి వాడుకోవచ్చు. స్ప్రే చేయవచ్చు లేదా చేతి వేళ్లతో మృదువుగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ నూనెను వారానికి రెండు సార్లు తలకు అప్లై చేసి ఉదయం తలస్నానం. చేయవచ్చు. అర్జెంట్ అనుకున్నవారు కనీసం రెండు గంటలు ఉంచుకోవడం వలన జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

    మరో పద్దతి..

    మనకు బయట దొరికే బాటిల్ నూనె కాకుండా ముడి ఆముదం చూడటానికి తేనె రంగులో ఉంటుంది. దానిని తీసుకోవాలి. కొబ్బరి నూనె రెండు స్పూన్లు అముదం 1 స్పూన్ తీసుకోవాలి. దీనిని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేటి చేసి అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడెక్కాక ఇంకో గిన్నెలో ఆముదం కొబ్బరి నూనె నీటిలో పెట్టి అవి గోరువెచ్చగా అయిన తర్వాత కాటన్ బాల్స్ తో తలలోని కుదుళ్లకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కొద్దిరోజుల్లోనే మీ జుత్తు ఒత్తుగా అవుతుంది. రాలడం కూడా తగ్గుతుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Hair Loss, Health benefits, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు