వర్షాకాలం (monsoon), చలికాలం (Winter). చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మం (skin)లో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. బాహ్య చర్మ సంరక్షణ ( External skin care ) చాలా కీలకమవుతుంటుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో.. చర్మం సంరక్షణ ( Skin protection ) అనేది చాలా కీలకం. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టం కలుగుతుంది. అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం ( Skin ) పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ( Soft skin ) ఉంచుకుంటే మంచిది. సహజసిద్దంగా మీ చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుకోవడమెలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం. కావల్సిందల్లా నెయ్యి..
చర్మ సౌందర్యానికీ నెయ్యి..
నెయ్యితో అనేక లాభాలు (benefits) వున్నాయి. నెయ్యి కేవలం రుచికి, ఆరోగ్యానికే కాదు అందానికి (beauty) కూడా చాలా మంచిది. చర్మ సౌందర్యానికి (skin beauty) చాలా మంచిది.. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ కి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. చర్మానికి మంచి మెరుపునిస్తాయి. ఇక్కడ ఉన్న ఫేస్ మాస్క్ తో మృదువైన మెరిసే (bright) చర్మం స్వంతం చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై (apply) చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచేయండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బాగా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.ఆకట్టుకునే అందం మీ సొంతం అవుతుంది.
నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కండిషనర్ లా పని చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ (olive oil) కలిపి జుట్టుకి అప్లై చేయండి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచేసి తరువాత కడిగేయండి. ఈ ప్యాక్ జుట్టుని సాఫ్ట్ గా మ్యానేజ్ చేసేందుకు వీలుగా చేస్తుంది.
నెయ్యిలో నిమ్మరసం (lemon juice) కలిపి చుండ్రుని ట్రీట్ చేయడానికి కూడా వాడవచ్చు. మీ స్కాల్ప్ ని బాగా మసాజ్ చేయడం మర్చిపోకండి. ఇక మన పెదాలు ఎండకి పగిలిపోతుంటాయి. కొద్దిగా నెయ్యి వెచ్చ చేసి రాత్రి నిద్రకి ముందు ఆ నెయ్యిని పెదవులకి అప్లై చేయండి. మీరు నిద్ర లేచేప్పటికి మీ లిప్స్ పైన డ్రై ఫ్లేక్స్ కనబడతాయి. వాటిని స్క్రబ్ చేసేయండి. మీ పెదాలు మృదువుగా మారిపోతాయి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Face mask, Life Style