హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: ఈ ఒక్క పండుతో ఫేస్​ ప్యాక్​ వాడితే మీ చర్మంలో అందం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందట... అదేంటో తెలుసా..

Beauty tips: ఈ ఒక్క పండుతో ఫేస్​ ప్యాక్​ వాడితే మీ చర్మంలో అందం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందట... అదేంటో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మామిడి కాయ లో ఉండే గుణాలు నల్ల మచ్చలు (black dots), మొటిమలు (pimples) వంటి సమస్యలను పోగొట్టి, ముఖంలో కొత్తదనాన్ని నింపుతాయి.. ఈ మామిడి కాయను స్క్రబ్బింగ్, ట్యానింగ్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్ ఇలా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ మామిడి కాయ గుజ్జుకు, ఓట్మీల్ అలాగే బాదం తో కలిపి కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

పండ్లలో రారాజైన మామిడి పండు (mango) తినకుండా ఎవరూ ఉండలేరు. అయితే, మామిడి పండ్లను తింటే గడ్డలు వస్తాయని, వేడి చేస్తాయని చాలామంది భయ పడతారు. అయితే, వాటి కోసం మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మామిడి పండ్లను అదేపనిగా అతిగా తినేవారికి మాత్రమే ఆ సమస్యలు వస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు కాయలు చొప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా. ఈ వేసవిలో మీ అందం (beauty), ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే.. తప్పకుండా మామిడి పండ్లను తినాల్సిందే. మామిడితో మన అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు.. మామిడి కాయ లో ఉండే గుణాలు నల్ల మచ్చలు (black dots), మొటిమలు (pimples) వంటి సమస్యలను పోగొట్టి, ముఖంలో కొత్తదనాన్ని నింపుతాయి.. ఈ మామిడి కాయను స్క్రబ్బింగ్, ట్యానింగ్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్ ఇలా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ మామిడి కాయ గుజ్జుకు, ఓట్మీల్ అలాగే బాదం తో కలిపి కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు..

ఎలా చేయాలి..

చర్మం పై ట్యాన్ ఏర్పడటం సహజమే. ఈ ట్యాన్ ను తొలగించుకోవడానికి మామిడి (mango) గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇందుకోసం ఒక చెంచా గోధుమ పిండి, కొద్దిగా మామిడిపండు గుజ్జు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ (face pack) లాగా అప్లై చేయాలి. ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటి (water)తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు (skin holes) తెరచుకొని, ఆ రంధ్రాల్లో ఉన్న దుమ్ము (dust) ధూళి పూర్తిగా తొలగిపోతాయి. ఫలితంగా ట్యాన్ సమస్య తగ్గుతుంది..

చర్మ రంగును పెంపొందించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.. ఇక ఇందుకోసం నీరు, పాల (milk)లో నానబెట్టిన బాదం (almond) పేస్ట్,  ఓట్మీల్, మామిడి గుజ్జు  (mango pulp) అన్నీ కలిపి తయారు చేసే ఈ ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగపడుతుంది.. ఇందుకోసం ఒక చెంచా మామిడి గుజ్జు (mango pulp)లో కొద్దిగా బాదం పేస్ట్ 2-3  చెంచాల పాలు వేసి, బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇక ఎప్పుడైనా పొరపాటున దెబ్బతగిలి రక్తస్రావం జరుగుతున్నప్పుడు, పచ్చి మామిడి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా పచ్చి మామిడి కాయలు వేడి నీటిలో వేసి బాగా మరిగించి, ఆ రసాన్ని దెబ్బ తగిలిన ప్రాంతంలో రాయడమే.. ఇలా చేయడం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఈ నీటితో ముఖాన్ని శుభ్ర పరచుకోవచ్చు. ఫలితంగా ముఖంపై వచ్చే మచ్చలు,  మొటిమలు లాంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం దొరుకుతుంది..

First published: