Kitchen tips: నిల్వ చేసిన పిండిలో పురుగులు చేరుతున్నాయా? ఈ విధంగా తరిమేయండి!

వర్షాకాలం తినే ఆహార పదార్థాలపై బ్యాక్టిరియా ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. స్టోర్‌ చేసుకున్న పదార్థాల్లో బగ్స్‌ చేరతాయి. అయితే, కొన్ని సులభ మార్గాలతో మీ ఆదాయానికి గండి పడకుండా చేసుకోచ్చు.

వర్షాకాలం తినే ఆహార పదార్థాలపై బ్యాక్టిరియా ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. స్టోర్‌ చేసుకున్న పదార్థాల్లో బగ్స్‌ చేరతాయి. అయితే, కొన్ని సులభ మార్గాలతో మీ ఆదాయానికి గండి పడకుండా చేసుకోచ్చు.

  • Share this:
సాధారణంగా ఇంటికి సరిపడే సరుకులు దాదాపు రెండు నెలలు లేదా కనీసం నెలకు సరిపోయేవి తెచ్చుకుంటాం. అయితే, అవి కొన్ని రోజుల్లోనే అందులో పురుగులు Bugs చేరి పాడైపోతాయి. ఇక చేసేదేమి లేక పారబోస్తాం. అయితే, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. అవేంటో చూద్దాం.

వంటగది kitchen  ఎంత శుభ్రంగా ఉన్నా.. పప్పు, ఉప్పుల డబ్బాల్లో పురుగులు చేరి చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా గోధుమ ఇతర పిండి డబ్బాల్లోకి చొరబడతాయి. ఈ వర్షాకాలం monsoonలో ఇవి వాటి బ్రీడింగ్‌ మంచి వాతావరణం. వాటి పునరుత్పత్తి పెరిగివే ఆపడం కష్టం. వీటిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాదు. డబ్బాల్లో పురుగులు వంటివి లేనంత వరకు స్టోర్‌ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం మంది సంచులలోనే పిండిని నిల్వ ఉంచుకుంటారు. కానీ, దీనివల్ల పురుగులు చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో వాటిని ఎక్కువరోజులు భద్రపరచవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.

స్టీల్‌ డబ్బాలను వాడాలి..
ముఖ్యంగా పిండిని కవర్, బ్యాగుల్లో నుంచి తీసివేయాలి. గాలిలో ఉండే తేమ వల్ల పిండి నాణ్యత తగ్గిపోతుంది. అందుకే స్టీల్‌ లేదా అల్యూమినియం కంటైనర్లలో స్టోర్‌ చేసుకోవాలి. ముందుగా ఆ డబ్బాలు డ్రైగా ఉన్నాయో లేదా అని చెక్‌ చేసుకోవాలి. వీలైతే కాసేపు సూర్యరశ్మి Sunlight లో పెట్టాలి. తడిగా లేని డబ్బాల్లో మాత్రమే పిండిని స్టోర్‌ చేసుకోవాలి. అంతేకాదు, మూత టైట్‌గా ఉన్నది చూసి పెట్టాలి. అంటే గాలి చొరబడనివ్వకుండా ఉండాలి. పిండిని వాడేటప్పుడు ఏదైనా గరిటే లేదా స్పూన్‌తో మాత్రమే కావాల్సిన పిండిని తీసుకోవాలి. పిండిని ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచాలంటే 4–5 స్పూన్ల ఉప్పును దాదాపు 10 కేజీల పిండికి కలుపుకోవచ్చు. దీన్ని బాగా కలపాలి. ఇది పిండిలో పురుగును చేరనివ్వకుండా కాపాడుతుంది.

ఎండుమిర్చి లేదా బే లీవ్స్‌...
ఒకవేళ మీకు ఉప్పు కలపడం ఇష్టం లేకపోతే.. ఎండు మిర్చి Dry chillis లేదా బిర్యాని ఆకు Bay leafs వేసుకోవచ్చు. 10–15 ఎండుమిర్చి లేదా 3–4 బిర్యాని ఆకును వేసి పిండిని బాగా కలుపుకోవాలి. మిర్చి విత్తనాలు పిండిలో పడకుండా వేసుకోవాలి. ఈ రెండింటితో పిండిలో పురుగు చేరకుండా కాపాడవచ్చు. బే లీవ్స్‌ పురుగును తరమడానికి మంచి సరైన పద్ధతి. ఒకవేళ ఇప్పటికే బగ్స్‌ చేరిపోతే.. ఆ డబ్బాలను ఎండలో పెడితే Ðఅవి పారిపోతాయి. ఎందుకంటే వాటికి చీకటి ప్రదేశాలే నచ్చుతాయి.
Published by:Renuka Godugu
First published: