Home /News /life-style /

IF YOU SUFFERING FROM MOUTH SMELL PROBLEM EVEN AFTER DAILY BRUSH TOO THEN FOLLOW THESE TIPS TO OVERCOME PRV

Health tips: మీరు రోజూ బ్రష్​ చేసినా నోటి దుర్వాసన వస్తుందా? అయితే ఈ​ చిట్కా పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దంతాలను తోముకుంటే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే చాలామందికి  దంతాలు రోజూ బ్రష్​తో తోముకున్నా.. నోటి దుర్వాసన (Bad breath) వస్తుంది. ఈ నోటి దుర్వాసన (mouth smell) ఒక పెద్ద సమస్యే.

    దంతాలు (Teeth). ముఖంలో నవ్వు (Smile)ను ప్రతిబించించేవి. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా(smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాలు (Teeth) తోముకోకపోతే నోట్లో (mouth) బాక్టీరియా పెరిగిపోతుంది. నోట్లో బాక్టీరియాను అలాగే పెట్టుకుని ఉదయం బెడ్ టీ, కాఫీ ల‌ను తాగ‌డం మంచిది కాదు. కొందరు ఆహారం (food) కూడా తింటారు. అది ఇంకా చేటు చేస్తుంది. అందువల్ల ఉదయం కచ్చితంగా దంతాలను తోముకోవాలి. తరువాతే ఆహారాలను లేదా టీ, కాఫీ వంటివి తీసుకోవాలి. నోటి శుభ్రత లేక‌పోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. దీంతో దంతాల‌ను తీసేయాల్సి (remove) వ‌స్తుంది. చిగుళ్ల స‌మ‌స్య‌లు వస్తాయి. దంతాలు బ‌ల‌హీనంగా(weak) మారుతాయి. క‌నుక దంతాలను రోజూ తోముకోవాలి.

    ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోముకుంటే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే చాలామందికి  దంతాలు రోజూ బ్రష్​తో తోముకున్నా.. నోటి దుర్వాసన (Bad breath) వస్తుంది. ఈ నోటి దుర్వాసన (mouth smell) ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చినా, చాలా వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలనే ఈ సమస్య తలెత్తుతుంది.

    ఆపిల్​ బెటర్​..

    ఆపిల్ (apple) లేదా క్యారట్లను రోజు తినండి. వీటి వలన పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలినాలు క్లీన్ (clean) అయ్యి నోరు శుభ్రంగా, తాజాగా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది. తేలికగా, క్రీం లాగా ఉండే ఆహార పదార్థాలు పళ్ల పై, నాలుక పై అంటుకొని బాక్టీరియాని పెంచి దుర్వాసనకు దారి తీస్తుంది.

    గ్రీన్ టీ తాగండి..

    కాఫీ  (coffee)... దుర్వాసనకు ఓ మూల కారణం. అయితే ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం, గ్రీన్ టీ (green tea) ఆరోగ్యాన్నే కాదు, శ్వాస ను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది. అందుకే మీ కాఫీ రొటీన్లను వీలయితే గ్రీ టీకి మార్చుకోండి. కొబ్బరి, కొబ్బరి నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. అయితే వీటిల్లో శ్వాస ను మెరుగు పరచడం కూడా ఒకటని చాలా మందికి తెలియదు. కొద్దిపాటి కొబ్బరి నూనెని నోటిలోకి తీసుకోని నాలుగైదు సార్లు పుక్కిలించడం వలన నోటిలోని హానికారక బాక్టీరియా పోతుంది, చిగుళ్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips, Teeth

    తదుపరి వార్తలు