IF YOU SUFFER FROM STOMACH ACHE THEN FOLLOW THESE METHODS AND WILL DECREASE IMMEDIATELY PRV
Stomach pain: కడుపు నొప్పితో బాధ పడితే.. ఈ పద్దతులు పాటించండి. వెంటనే తగ్గిపోతుంది
ప్రతీకాత్మక చిత్రం
వయసుతో సంబంధం లేకుండా వేధించే చిన్న చిన్న సమస్యల్లో కడుపు నొప్పి కూడా ఉంటుంది. ఈ కడుపు నొప్పికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఏం తిన్నా వికారంగా అనిపించడం, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక పోవడం (digestive problem), అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడం, అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు ఇన్ఫెక్షన్ల ను గా గుర్తించవచ్చు
కడుపు నొప్పి (stomach pain) వంటివి సామాన్యంగా అందరికీ తెలిసినవే. వయసుతో సంబంధం లేకుండా వేధించే చిన్న చిన్న సమస్యల్లో కడుపు నొప్పి కూడా ఉంటుంది. ఈ కడుపు నొప్పికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. వాటిలో కాన్స్టిపేషన్, డయేరియా, యాసిడ్ రిఫ్లక్స్, లాక్టోజ్ ఇన్టాలరెన్స్, స్ట్రెస్, గ్యాస్ (gas), బ్లోటింగ్ వంటివి ఉంటాయి. అయితే ఏం తిన్నా వికారంగా అనిపించడం, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక పోవడం (digestive problem), అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడం, అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు ఇన్ఫెక్షన్ల ను గా గుర్తించవచ్చు.. నిజానికి మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ వ్యవస్థ (digestive system)లో తలెత్తే ఇలాంటి సమస్యలను మనం చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం.. అంతేకాకుండా తగ్గిపోతుందిలే అన్న నిర్లక్ష్యం కూడా మనలో ఉంటుంది.. కానీ ఇలాంటి లక్షణాలను పొట్ట చుట్టూ ఇన్ఫెక్షన్లు లేదా ఫ్లూ అంటున్నారు నిపుణులు.
జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల, దీని ప్రభావం ఇతర అవయవాల పనితీరు పై కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే, ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంట ఆ పద్దతులేంటో ఒకసారి తెలుసుకుందాం..
వాంతులు, విరేచనాలు,..
పొట్ట లో ఇన్ఫెక్షన్ కారణంగా అయ్యే వాంతులు, విరోచనాలు వల్ల శరీరం ఎక్కువ మొత్తంలో నీటిని కోల్పోతుంది. తర్వాత శరీరం డీ హైడ్రేషన్ బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.. కాబట్టి మన శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవడానికి నీళ్లు, ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీళ్లు, అల్లం (ginger) తో తయారు చేసిన టీ, తాజా పండ్లు(fresh fruits) వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గడంతో పాటు శరీరానికి శక్తి కూడా లభిస్తుంది..
గుండెలో మంట..
ఒత్తిడి (Stress) వల్ల పొట్టలో తగినంత యాసిడ్ ఉత్పత్తి కాదు. తద్వారా గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్, త్రేంపులు, గ్యాస్, బ్లోటింగ్, తిన్న తరువాత వికారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి హోమ్ రెమెడీస్ లో గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం (lemon juice) కలుపుకుని తాగడం ఒకటి. దీన్ని పొద్దునే పరగడుపున చేయాలి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి తీసుకోవాలి. అలాగే, ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ రా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి భోజనానికి పావుగంట లేదా అరగంట ముందు తీసుకోవడం కూడా మంచిదే. ఒకవేళ గుండెలో మంటగా ఉంటే దీనిని భోజనం తరువాత తీసుకోవచ్చు
కడుపులో వికారంగా అనిపించినప్పుడు కోడి గుడ్లను (eggs) స్నాక్స్ గా తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ బి, సెలీనియం రోగనిరోధక వ్యవస్థ(immunity system)ను పటిష్టం చేయడంలో సహకరిస్తాయి. తద్వారా ఎలాంటి సమస్యనైనా దూరం చేసుకోవచ్చు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.