అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే..!

కొన్ని ఆహార పదార్థాల్లో పురుగులు చేరటం, మరికొన్ని మురిగిపోవడం వంటివి జరుగుతాయి. కానీ, కొన్ని చిట్కాలతో వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు

కొన్ని ఆహార పదార్థాల్లో పురుగులు చేరటం, మరికొన్ని మురిగిపోవడం వంటివి జరుగుతాయి. కానీ, కొన్ని చిట్కాలతో వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు

  • Share this:
మనం వంట కోసం కొద్దిగా ఎక్కువ పరిమాణంలోనే కొనుగోళ్లు చేస్తాం. అంటే, కనీసం నెలకుసరిపడా వస్తువులు తెచ్చుకుంటాం. అయితే, వాటిని నిల్వ చేసుకునే పద్ధతిలోనే కాస్త తలనొప్పిగా ఉంటుంది. . వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.

మనం తెచ్చుకునే వస్తువులో కాఫీపొడి తప్పనిసరిగా ఉంటుంది. అయితే, ఇన్‌స్టంట్‌ కాఫీపొడి గడ్డకట్టకుండా.. ఉండాలంటే దాన్ని ఎయిర్‌ టైట్‌ డబ్బాలో ఉంచి డీప్‌ ఫ్రీజ్‌లో పెడితే ఎంత కాలమైనా గడ్డకట్టకుండా ఉంటుంది. చెక్కతో తయారు చేసిన చెంచాలు, గరిటెలు వాసన వస్తుంటే.. వెనిగర్‌ కలిపిన నీటిలో ఉంచాలి. కొద్దిసేపు తర్వాత వాసనరావు.

వంటగదిలో చీమలు ఎక్కువగా ఉంటే ఒక దోసకాయ ముక్కలుగా కోసి చీమలు తిరిగే ప్రాంతంలో ఉంచాలి.
కూరగాయలు వడలిపోతే.. నిమ్మరసం కలిపిన నీటిలో ఓ పది నిమిషాలు ఉంచండి ఆ తర్వాత అవే తాజాగా అవుతాయి.

చేపముక్కల్ని నిల్వ చేయాలంటే..వాటికి కొద్దిగా ఉప్పు రుద్ది డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టాలి. ముక్కలు అంటుకోవు..ఐస్‌ పేరుకోదు.
వంట చేసేటపుడు కూరల్లో మసాలాలు ఎక్కువైతే... రెండు మూడు టమాటలను ఉడికించి అందులో కలపాలి. మసాలా ఘాటు తగ్గి కూర రుచిగా ఉంటుంది.

పెనం, కడాయి వంటివి మరకలు పోకపోతే డిష్‌ వాషర్‌లో కాస్త వంట సొడా కొన్ని నీళ్లు వేసి రుద్దాలి. అలాగే జిడ్డుగా ఉంటే.. నీళ్లలో మూడు గంటలు నానబెట్టి, నిమ్మ చెక్కతో రుద్దాలి.
అన్నం వండుకునేటపుడు కొత్త బియ్యం అవుతే ముద్దగా అవుతుంది. ఉడికేటపుడు చెంచా వంట నూనె వేస్తే పొడిపొడిగా ఉంటుంది.

వడలు, గారెలు చేసేటపుడు నూనె చిల్లుతోందా? అయితే, రెండు చెంచాల నూనెను అందులో వేయాలి.
దోశలో మెత్తగా రావాలంటే...బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వను ఓ కప్పు జావకాచి చల్లారక దోశ పిండిలో కలపాలి.అల్లం వెల్లుల్లి ఎక్కువకాలం నిల్వ ఉండటానికి కాగితం కవర్‌లో వేసి లేదా పేపర్‌లో పొట్లం కట్టి ప్రీజ్‌లో పెట్టండి.

నిల్వ పచ్చళ్లు పడకుంటే.. సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్, క్యారట్‌ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి కావాలనుకున్నప్పుడు పెరుగు అన్నంతో తినండి. పంచదార డబ్బాకు చీమలు పడితే.. అందులో కొన్ని లవంగాలను వేయాలి.
Published by:Renuka Godugu
First published: