హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: మీ ముఖానికి ఇలా ఆవిరి పడితే చర్మం కాంతివంతంగా మారినట్లే.. ఎలా చేయాలంటే

Beauty tips: మీ ముఖానికి ఇలా ఆవిరి పడితే చర్మం కాంతివంతంగా మారినట్లే.. ఎలా చేయాలంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందం (beauty) ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఈ వాతావరణంలో తేడాలు, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని ముఖంలో నలుపురంగు వస్తుంది. అయితే షాపుల్లో దొరికే క్రీములు, మాయిశ్చరైజర్లు వాడి చాలామంది తమ ముఖాన్ని పాడుచేసుకుంటారు. ఆ తర్వాత మొటిమలు రావడం, ముఖం (face)లో నిగారింపు తగ్గడమూ జరుగుతాయి. అందుకే ఇంటి చిట్కాలు ముఖం మెరవడానికి బెటర్​ అని ఆయుర్వేద నిపుణులు (experts) చెబుతున్నారు

ఇంకా చదవండి ...

అందం (beauty) ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఈ వాతావరణంలో తేడాలు, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని ముఖంలో నలుపురంగు వస్తుంది. అయితే షాపుల్లో దొరికే క్రీములు, మాయిశ్చరైజర్లు వాడి చాలామంది తమ ముఖాన్ని పాడుచేసుకుంటారు. ఆ తర్వాత మొటిమలు రావడం, ముఖం (face)లో నిగారింపు తగ్గడమూ జరుగుతాయి. అందుకే ఇంటి చిట్కాలు ముఖం మెరవడానికి బెటర్​ అని ఆయుర్వేద నిపుణులు (experts) చెబుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఇంటి చిట్కాలకే (tips) పరిమితం అవుతున్నారు. మొదట్లో అయితే చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ, సౌందర్య నిపుణుల చుట్టూ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు పెట్టుకునేవారు. ఎన్నో సైడ్ ఎఫెక్ట్ (side affects) లను ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే మీ ముఖానికి ఆవిరి పడితే,  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దాని గురించి ఇపుడు తెలుసుకుందాం..

ఆవిరితో..

బ్యూటీ పార్లర్ల చుట్ట తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకునేవారికి, ఫలితం అప్పటికప్పుడే వస్తుంది. కానీ తరువాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్ లను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, ముఖానికి ఆవిరి (steam) పట్టడం వల్ల చర్మ (skin) రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్ము (dust), ధూళిని నిర్మూలించడానికి ఆవిరి సహాయపడుతుంది. ఫలితంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడం సులభం అవుతుంది. ఆవిరి పట్టడం వల్ల మన ముఖం మీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా సహజమైన ఆరోగ్యకరమైన కాంతి (healthy light) మీ చర్మానికి సంతరించుకుంటుంది.

ఎప్పుడైతే చర్మానికి ఆవిరి పడతామో, అప్పుడు చర్మానికి (for skin) తగినంత తేమ అందుతుంది. ఆవిరి పట్టే సమయంలో సరైన రక్త ప్రవాహం జరిగి కొల్లేజన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని ఫలితంగా చర్మం యవ్వనం (young)గా కనిపిస్తుంది.. అంతేకాకుండా ఆరోమాథెరపీ ద్వారా కూడా ఆవిరి పట్టవచ్చు. ఆవిరి పట్టేటప్పుడు సువాసనలను అందించే, నూనెను ఒక రెండు మూడు చుక్కలు నీటిలో వేస్తే సైనాస్ తో పాటు తరచూ వచ్చే తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.. కాబట్టి ఇంట్లోనే అతి తక్కువ సమయంలోనే ఆవిరి పట్టుకొని ముఖం అందంగా మారే లాగా ప్రయత్నించండి.

నల్లటి వలయాలపై..

కలబందలో చిక్కటి ద్రవం లాంటి జెల్ ఉంటుంది. ఇది చర్మంపై నల్లటి వలయాలను(dark circles) తగ్గించడానికి ఉత్తమంగా పనిచేసే పదార్థం. నల్లని ప్రదేశంలో కలబంద జెల్ వర్తించాలి, రాత్రిపూట నానబెట్టి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే, నల్లటి వలయాలు వెంటనే తగ్గుతుంది. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ను ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తో కలపండి. తర్వాత ప్రతి రాత్రి పడుకునే ముందు మిశ్రమాన్ని కాటన్ బాల్‌లో నానబెట్టి ముఖం తుడవండి.

First published:

Tags: Beauty tips, Face mask, Life Style

ఉత్తమ కథలు