Home /News /life-style /

Good sleep: ఈ పూలు పక్కన పెట్టుకుని పడుకుంటే సుఖమైన నిద్ర పడుతుందట.. అవేంటో తెలుసా?

Good sleep: ఈ పూలు పక్కన పెట్టుకుని పడుకుంటే సుఖమైన నిద్ర పడుతుందట.. అవేంటో తెలుసా?

మల్లెపూలు

మల్లెపూలు

మల్లెపూలు పక్కన పెట్టుకని పడుకుంటే హాయిగా నిద్ర(sleep) పడుతుందట. రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురాను భూతులను పంచే మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. అంతేకాదు ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా వుండటమే కాదు, కళ్లకూ మేలు చేస్తాయి.

ఇంకా చదవండి ...
  ఇంటికి సువాసనలిచ్చే మల్లెపూల(jasmine) గురించి, మహిళల జడల్లో తళ తళ మెరిసి పోయే మల్లెల గురించి పరిచయం చేయాల్సినపనిలేదు కదా.. చల్లదనానికి, కమ్మదనానికి, సౌందర్య(beauty) వికాసానికి, మరులు గొలిపే గుబాళింపులకు మారుపేరైన మల్లెపూలు(jasmine) ఔషధంలాగా, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగ పడుతుందంటే ఆశ్చర్యపోవటం దేనికి. మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్నిస్తాయని అందరికీ తెలిసిందే, అయితే ఈ పూలను ఔషధాలుగా కూడా వాడుకోవచ్చునని కొందరికే తెలుసు.. రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురాను భూతులను పంచే మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. అవును మల్లెపూలు పక్కన పెట్టుకని పడుకుంటే హాయిగా నిద్ర(sleep) పడుతుందట. అంతేకాదు ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా వుండటమే కాదు, కళ్లకూ మేలు చేస్తాయి.  అలసిన కనురెప్పలపై మల్లెలను కొద్దిసేపు పరిచి వుంచితే చలవ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది. పరిమళ భరిత మల్లెపూవుల్ని ఎన్నో సుగంధ సాధనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. సబ్బులు, తలనూనెలు(hair oils), సౌందర్య సాధనాలు, అగరు బత్తీల తయారీల్లో మల్లెపూలను ఉపయోగిస్తారు.

  సెంట్లు, ఫర్‌ఫ్యూమ్‌లలో అయితే మల్లెపూలను విరివిగా ఉపయోగిస్తారు. తలలో చుండ్రు సమస్య అధికంగా వుంటే మెంతులలో కాసిన్ని ఎండు మల్లెపూలు కలిపి నూరి తయారై పూతను తలకు పట్టిస్తే మంచిది. కళ్లమంటలు, నొప్పులు తగ్గడానికి మల్లెల కషాయాన్ని వాడవచ్చు. పూలు, ఆకులతో కషాయం కాచాలి. ఈ కషాయాన్ని వడగట్టి చల్లార్చి.. రెండువంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, ఒక వంతు కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతి కోపం, మానసిక చంచలత్వం.. వీటన్నిటినీ శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంది. చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు పూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలి. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర(good sleep) పడుతుంది. మనసు స్థిమితంగా మారుతుంది, మధుమేహులకు మల్లెపూలతో చేసిన ఛాయ్‌(tea) తాగితే మంచిది. రక్తం(blood)లో చక్కెర స్థాయులను తగ్గించే గుణం మల్లెలకు ఉంది.

  గుప్పెడు మల్లెపూలను కొబ్బరినూనెలో వేసి ఒక రోజంతా నానబెట్టాలి. ఆ తరువాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దన చేసుకుంటే.. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. తాజా మల్లెలను మెత్తగా నూరి.. తడిబట్ట పై చుట్టి, కళ్లమీద పెట్టుకుంటే.. కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరిపోవడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు కలగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని.. ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది. తల నొప్పి సమస్యలకు మల్లెపూలతో తలకు వాసెన కట్టు కడితే.. మంచి ఉపశమనంగా ఉంటుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా.. తలనొప్పిని తగ్గిస్తుంది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Flower crops, Health benefits, Life Style, Meera Jasmine, Sleep

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు