హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

Beauty tips: ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి

యుక్త వయసు దాటాక కూడా మొటిమలు వస్తుంటే అది ఏదో ఒక జబ్బుకి సంకేతం అయ్యుండొచ్చు. అందుకే మొటిమల సమస్య (acne problems) గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లకు తెలియజేయాలి.

యుక్త వయసు దాటాక కూడా మొటిమలు వస్తుంటే అది ఏదో ఒక జబ్బుకి సంకేతం అయ్యుండొచ్చు. అందుకే మొటిమల సమస్య (acne problems) గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లకు తెలియజేయాలి.

మామూలుగా చాలామందికి చర్మం పగుళ్లు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వేసవి కాలంలో కూడా  శరీరం డీ హైడ్రేషన్ కు గురైనప్పుడు, చర్మం పగుళ్ళకు (Cracked skin) దారితీస్తుంది.. ఈ పగిలిన చర్మం (cracked skin) రిపేర్ చేసుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు రాస్తూ ఉంటారు.

ఇంకా చదవండి ...

అందం (beauty) ప్రతీ ఒక్కరూ కావాలని ఆరాటపడేది. ముఖం (face) అందంగా ఉండటానికి చాలామంది చాలా చేస్తారు. అయితే వాతావరణం కలుషితం (pollute) అవుతుండటంతో మన ముఖం (face) కూడా పాడవుతోంది. ఏవేవో పనికిరాని క్రీమ్​లు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు చాలామంది. ఇక కొంతమందైతే ఆ క్రీమ్ (creams)​లు లేకుండా బతకలేం అన్నంతగా వాడుతారు. అలాంటి వారు ముఖానికి ఏదో ఒకటి కెమికల్​ క్రీమ్​ (Chemical cream)లు వాడందే బయట పడరు. ఇక వారిని ఆ క్రీమ్​లు లేకుండా చూస్తే మాత్రం గుర్తే పట్టలేం. అయితే సహజసిద్ధంగా తయారు చేసుకునే ఫేస్​ప్యాక్​లతో కొంచెం ఇలాంటి ఇబ్బందులు (problems) ఉండవు. మామూలుగా చాలామందికి చర్మం పగుళ్లు (skin cracks) ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వేసవి కాలంలో కూడా  శరీరం (body) డీ హైడ్రేషన్ కు గురైనప్పుడు, చర్మం పగుళ్ళకు (Cracked skin) దారితీస్తుంది.. ఈ పగిలిన చర్మం (cracked skin) రిపేర్ చేసుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు రాస్తూ ఉంటారు.

వేప చెట్టు..

వేప చెట్టు (neem tree)ని చాలామంది దైవంగా భావించి పూజలు కూడా చేస్తారు. అలాగే వేప (neem) చెట్టు అనేది ఓ అద్భుతమైన ఔషధం అనే చెప్పాలి. వేప చెట్టు ఆకులు (neem Tree leaves), గింజలు, పువ్వులు అన్నీ కూడా మనకి ఒక ఔషధంలాగా ఉపయోగపడతాయి. అలాగే వేప ఆకులను ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు. అలాగే వేప ఆకులు (nee leaf) అనేవి  యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-పారాసిటిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఫంగల్‌గా ఉపయోగపడుతుంది. వేప ఆకుల్లో C విటమిన్ ఉంటుంది. అది నల్ల మచ్చలు, మొటిమలు, పొడి బారే చర్మం, ముడతలు (Wrinkles) , గీతలను తొలగిస్తుంది. కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. అందుకే వేపతో తయారయ్యే సబ్బులతో స్నానం (bath) చేసేవారు కోమలంగా, యవ్వనత్వంతో కనిపిస్తారు.

ముందుగా  కొన్ని వేపాకుల్ని కడిగి మిక్సీలో వేసి, పేస్టులా చేసుకుని చర్మం (skin)పై రాసుకోవాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. కావాలంటే కొద్దిగా పెరుగు లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. వేప ఆకులు జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి. మీకు ఒకవేళ చుండ్రు (dandruff) సమస్య గాని,  జుట్టు ఎండినట్లు మారడం, చిక్కులు పడటం, దురదలు, జుట్టు రాలుట, జుట్టు సన్నగా అవ్వుట, వెంట్రుకలు (Hairs) చిట్లి పోవుట ఇలాంటి సమస్యలు ఉంటే వీటన్నిటికీ  వేపాకుల పొడే బెటర్​.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

First published:

Tags: Ayurveda, Beautiful tree, Beauty, Beauty tips, Face mask

ఉత్తమ కథలు