Home /News /life-style /

IF YOU HAVING PROBLEMS OF STOMACH PAIN REGULARLY THEN MUST FOLLOW THESE TIPS TO COME OUT OF PAIN PRV

Stomach pain relief: కడుపు నొప్పి తరుచుగా వస్తోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే.. నొప్పి చిటికెలో దూరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు (problems) వస్తుంటాయి. అయితే ఈ చిట్కాలు ప్రయత్నిస్తే నొప్పి ఈజీగా తగ్గుతుంది.

    కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం (food)లోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు (problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి (stomach pain) కారణం అవ్వవచ్చు.

    కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు (Immunity power down).. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ (digestive system) పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

    శారీరక శ్రమ (Physical activity) అనేది వాయువును బయటకు తీయడానికి సులభమైన మార్గం. అధిక వాయువు, ఉబ్బరం నుంచి బయటపడటానికి యోగా, స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేయండి. కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఉపయోగపడతాయి. సికాయ్ చేయడం ద్వారా కండరాలు సడలించబడతాయి. ఇది మంట నుంచి ఉపశమనం (Relief) కలిగిస్తుంది. మీరు తాపన ప్యాడ్, వేడి నీటి బ్యాగ్ బాటిల్ ఉపయోగించవచ్చు. కడుపు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

    ఒక కప్పు టీ తాగడం..

    హెర్బల్ టీ (Herbal tea) ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి. ఒక కప్పు టీ తాగడం ద్వారా మీరు మీ శరీరానికి మనసుకు విశ్రాంతినివ్వవచ్చు. పెరుగు (Curd) ప్రోబయోటిక్స్ గట్ మైక్రోబయోమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు దోహదం చేస్తుంది. పెరుగు ప్రోబయోటిక్స్ గొప్ప మూలం. మీరు దీన్ని అనేక రకాల వంటలలో తినవచ్చు.

    దాల్చిన చెక్క (Cinnamon) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ (digestive) చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తిన్న తర్వాత.. దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి తీసుకోవాలి. కడుపు నొప్పి సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కడుపులో జలుబు తగ్గాలంటే జీలకర్ర, కొత్తిమీర, మెంతి, కారం, మెంతి కూరలను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.



    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Stomach Pain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు