Home /News /life-style /

IF YOU HAVE WHITE HAIR AT A YOUNG AGE THEN YOU MUST KNOW FEW THINGS ABOUT THAT PROBLEM PRV

white hair treatment: చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుందా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అసలు తెల్ల జుట్టు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే.. మన వెంట్రుకలలోని కణాలు అందులోని నల్లని పిగ్మెంట్ మెలనిన్ ని కోల్పోవడం అనే చెప్పుకోవాలి. దీనికి వయసు ఓ ముఖ్యమైన కారణం కాగా.. దీనితో పాటు చాలా కారణాలే ఉంటాయి. అవేంటంటే..

    ప్రస్తుత జీవనశైలి వల్ల చాలామందిలో చిన్న తనంలోనే అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు (white hair) కనిపించడం. కొంతమందికి తెల్ల వెంట్రుకలు బయటకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యను కప్పిపుచ్చుకునేందుకు జుట్టుకు రంగు వేస్తూ, వెంట్రుకలను మరింత పాడుచేసుకుంటారు చాలామంది. అయితే చిన్న వయసులోనే మీ జుట్టు తెల్లబడుతుంటే.. అందుకు గల కారణాలను విశ్లేషించుకొని, దానికి తగినట్లుగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. డాక్టర్ల సలహా (white hair treatment)తో మందులు వాడి.. కొత్తగా వచ్చే జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు. అసలు తెల్ల జుట్టు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే.. మన వెంట్రుకలలోని కణాలు అందులోని నల్లని పిగ్మెంట్ మెలనిన్ ని కోల్పోవడం అనే చెప్పుకోవాలి. దీనికి వయసు ఓ ముఖ్యమైన కారణం కాగా.. దీనితో పాటు చాలా కారణాలే (Reasons) ఉంటాయి. అవేంటంటే..

    మనం బయటకు కనిపించే సమస్యలనే అనారోగ్య సమస్యలుగా భావిస్తుంటాయి. అయితే శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మానసిక సమస్యల గురించి పట్టించుకోము. ముఖ్యంగా ఒత్తిడి (Stress) వల్ల కలిగే నష్టాల గురించి పెద్దగా మనలో చాలా మందికి అవగాహన కూడా ఉండి ఉండదు.  అయితే జుట్టు తెల్లగా మారడానికి కూడా ఒత్తిడి (Stress) ఓ కారణమని మీకు తెలుసా? విపరీతమైన ఒత్తిడి జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

    హార్మోన్​ విడుదలే కారణం..

    పలువురిపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఒత్తిడి కారణంగా తల వెంట్రుకలు తెలుపు రంగులోకి (White color) మారతాయని తమ పరిశోధనల్లో వెల్లడైందని చెప్పుకొచ్చారు. తలపై జుట్టు రంగు మారితే శరీరంలో దాదాపు 300 రకలా ప్రోటీన్లు మారుతాయని పరిశోధకులు వివరించారు. తీవ్రమైవన ఒత్తిడి (Stress), ఆందోళన కారణంగా కార్టిసాల్‌ అనే హార్మోన్‌ పెద్ద ఎత్తున విడుదలవుతుందని, ఇది జుట్టు రంగు మారడంలో కారణంగా మారుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

    అయితే మానసిక ఒత్తిడి (Stress)ని తగ్గించుకోగలితే కోల్పోయిన జుట్టు రంగును తిరిగి పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.  9 నుంచి 65 ఏళ్లకు చెందిన 14 మంది ఆరోగ్యవంతుల నుంచి 397 వెంట్రుకలను సేకరించి వాటిపై పరిశోధనలు జరిపారు. వీరిలో కొన్ని నెలలుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిలో జుట్టు రంగు మారడాన్ని గుర్తించారు.

    విహారయాత్రలకు వెళ్లడం..

    ఒత్తిడి తగ్గిన తర్వాత అంటే విహారయాత్రలకు (Holiday tours) వెళ్లడం లేదా తమకున్న టెన్షన్స్‌ తగ్గిన తర్వాత తిరిగి నల్లటి జుట్టు (black hair) రావడం గమనించారు. అయితే తెల్లగా మారిన జుట్టు రంగు మారడం అంటే కొత్తగా పుట్టుకొచ్చే వెంట్రుకల మొదల్ల నుంచి రంగు మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటూ, మంచి పౌష్టికాహారాన్ని (healthy food for strong hair) తీసుకుంటే రంగు మారిన మీ జుట్టు మళ్లీ పాత స్థితిలోకి చేరుతుందని  చెబుతున్నారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair problem tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు