Home /News /life-style /

IF YOU HAVE TRIED THESE FIVE TYPES OF TEA WEIGHT LOSS IS GUARANTEED UMG GH

Weight Loss: బరువు తగ్గాలా..? ఈ ఐదు రకాల టీలను ట్రై చేశారంటే.. సన్నగా అవ్వడం గ్యారెంటీ..!

 ఈ ఐదు  రకాల టీ లను ట్రై చేశారంటే.. బరువు తగ్గడం గ్యారెంటీ !

ఈ ఐదు రకాల టీ లను ట్రై చేశారంటే.. బరువు తగ్గడం గ్యారెంటీ !

ఇంట్లోని వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు కూడా బరువు(Weight) తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో టీ(Tea) చేసుకుని పరగడుపున క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అధిక బరువు(weight) ఉన్నవారు బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మెడిసిన్ వాడడం, జిమ్‌(Gym)కు వెళ్లి వర్కౌట్స్ చేయడం, స్పెషల్ డైట్.. ఇలా చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయినా బరువు తగ్గక, ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇంట్లోని వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో టీ(Tea) చేసుకుని పరగడుపున క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది. థైరాయిడ్(Thyroid), డయాబెటిస్‌(Diabetes)తో బాధపడుతున్న వారు కూడా ఐదు రకాల దినుసులతో చేసే టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సి పదార్థాలు

2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర గింజలు- సోపు గింజలు- జీలకర్ర గింజలు- వాము గింజలు, కొద్దిగా దాల్చిన చెక్క, నీరు.

టీ తయారు చేసే విధానం
స్టెప్-1: ముందు అన్ని దినుసులను కడాయి లేదా పాన్‌లో ఉంచండి.

స్టెప్-2: సువాసన వచ్చే వరకు వాటిని పొడిగా వేయించండి.

స్టెప్-3: అవి చల్లారిన తరువాత గ్రైండ్ చేసి, పిండి కొట్టండి.

స్టెప్-4: ఒక పాన్‌లో 2 కప్పుల నీళ్లు పోసి సన్నని మంట మీద మరిగించాలి.

స్టెప్-5: 2 టీస్పూన్ల ఈ గింజల మిశ్రమాన్ని వేసి, వేడిచేసే ముందు దాల్చిన చెక్కను కొద్దిగా అందులో వేయాలి.

స్టెప్-6: ఈ మిశ్రమాన్ని 5-10 నిమిషాలు వేడి చేయండి.

స్టెప్-7: కప్పులో టీని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయండి. దీంతో వేడివేడిగా టీ రెడీ.

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ టీని తాగండి. రుచి చేదుగా ఉంటే, దాంట్లో కొంచెం తేనెను జోడించండి.

సుగంధ ద్రవ్యాల ప్రయోజనాలు

జీలకర్ర గింజలు
అధిక జీర్ణశక్తికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రలో నూనె ఉంటుంది. ఇది ఆమ్లత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఇందులో ఇనుము, మాంగనీస్‌లో సమృద్ధిగా ఉంటాయి. దీంతో శరీరంలోని అనేక లోపాలను నివారిస్తాయి.

దాల్చిన చెక్క
ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయేరియా, గ్యాస్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ (జీఐ) వంటి వ్యాధుల చికిత్సలో ఇది శక్తివంతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. పీరియడ్ క్రాంప్స్ చికిత్సలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది.

ఇదీ చదవండి: GK Capsule: పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా ? అయితే ఇదిగో మీకోసం స్పెషల్ జీకే క్యాప్సూల్..!వాము గింజలు
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని అజ్వైన్ అని పిలుస్తారు. ఈ దినుసులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగుపరచడంలో వాము కీలకంగా వ్యవహరిస్తాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి వాము చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

 సోంపు గింజలు
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువ సేపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీంతో అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. రోజంతా ఫిట్‌గా ఉండటానికి సోంపు గింజలు ఉపయోగపడతాయి.కొత్తిమీర గింజలు
ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో రాడికల్ యాక్టివిటీని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

టీ తయారీలో ఉపయోగించే ఈ దినుసులు బరువు తగ్గడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ, జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
Published by:Mahesh
First published:

Tags: Diabetes, Green tea, Health Tips, Herbal tea, Tea, Weight loss tips

తదుపరి వార్తలు