హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Monsoon Diet Plan: వర్షాకాలంలో ఈ డైట్ ఫాలో అయ్యారంటే .. రోగాలు మీ దగ్గరికి వస్తే ఒట్టు!

Monsoon Diet Plan: వర్షాకాలంలో ఈ డైట్ ఫాలో అయ్యారంటే .. రోగాలు మీ దగ్గరికి వస్తే ఒట్టు!

వర్షాకాల సీజన్ లో ఈ డైట్ ను గనుక ఫాలో అయ్యారంటే .. రోగాలు మీ దగ్గరికి వస్తే ఒట్టు!

వర్షాకాల సీజన్ లో ఈ డైట్ ను గనుక ఫాలో అయ్యారంటే .. రోగాలు మీ దగ్గరికి వస్తే ఒట్టు!

ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కొనసాగుతోంది. వానల కారణంగా దోమల బెడద తీవ్రమవుతోంది. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి. ఇందుకు పోషకాలు సమృద్ధ?

ఇంకా చదవండి ...

ప్రస్తుతం వర్షాకాలం సీజన్(Season)కొనసాగుతోంది. వానల కారణంగా దోమల బెడద తీవ్రమవుతోంది. దీంతో డెంగ్యూ(dengue), మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి. ఇందుకు పోషకాలు సమృద్ధిగా ఉన్న పదార్థాలను అహారంలో చేర్చుకోవాలి. అవేంటో పరిశీలిద్దాం.

వెల్లుల్లి

ఇందులో ఆరోగ్య, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్లూ, జలుబుకు కారణమయ్యే వైరస్‌లతో పోరాడుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తంలో టి-కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

నిమ్మ

నిమ్మరసంలో విటమిన్(Vitamins)- సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో నిమ్మ పాత్ర కీలకం. వీటిని తరచూ తీసుకుంటే జీర్ణక్రియ రేటు మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్‌తో పోరాడడం, ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు నిమ్మరసం సొంతం.

పాలకూర

ఇందులో బీటా కెరోటిన్, ఫోలిక్ ఫుడ్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ,ఈ, సీ కూడా తగిన మోతాదులో ఉంటాయి. పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే శరీరం తన విధులను సులభంగా కొనసాగిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే వంట చేయడానికి ముందు అన్ని ఆకుకూరలను బాగా కడగడం మర్చిపోవద్దు.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


నట్స్

బాదం, జీడిపప్పు, ఇతర గింజల్లో రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్- ఇ పుష్కలంగా ఉంటాయి. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఆహారంలో చేర్చుకోవాల్సిన ఐటెమ్స్‌లో ఇవి ఒకటి.

అల్లం

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అల్లంను తరుచూ తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలను శరీరంలో పెంపొందిస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులతో సహా అనేక వ్యాధులకు దీన్ని చికిత్సలో ఉపయోగిస్తారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో వాటర్ కూలర్లు, ట్యాంకులు, టైర్లు, మొక్కల కుండీలు, పారేసిన కొబ్బరి బోండాల్లోకి నీరు చేరి, దోమలకు నిలయాలుగా మారుతాయి. దీంతో వాటిలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. ప్రతి ఇంట్లో దోమ తెరలు వాడడం మంచిది. దోమలు ఇంట్లోకి రాకుండా సాయంత్రం పూట డోర్లు, కిటికీలను క్లోజ్ చేసుకోవాలి. వర్షాకాలంలో నీటి ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం చాలా ఎక్కువ. దీంతో వేడి చేసి, చల్లార్చిన నీటిని తాగడం మంచిది.

Published by:Mahesh
First published:

Tags: Dengue fever, Diet, Health food, Health Tips

ఉత్తమ కథలు