Home /News /life-style /

IF YOU HAVE A SORE THROAT OFTEN THEN FOLLOW THESE SIMPLE TIPS TO GET RID OF THAT SORE THROAT PAIN EASILY PRV

Sore throat: గొంతు నొప్పి తరచుగా బాధిస్తే ఈ సింఫుల్​ టిప్స్​ ఫాలో అయి నొప్పిని ఈజీగా దూరం చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. గొంతు నొప్పి  (Sore throat) వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు తెలుసుకుందాం...

    శారీరక శ్రమ తగ్గించినప్పటి నుంచి మనిషికి అనారోగ్య (Unhealthy) సమస్యలు ఎక్కువవుతున్నాయి. సరైన ఆహారం (good food) కూడా తీసుకోకపోవడం దీనికి మరో కారణం. కల్తీ ఆహారం కూడా కారణమే. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యం (health) ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. అందుకే ఎలాంటి ఆహారాలు దేనికి మంచివి అనేవి తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న ప్రపంచంలో వాతావరణం కూడా కలుషితం అవుతోంది. కనీసం స్వచ్ఛమైన గాలి (Fresh Air) కూడా అందడం లేదు మనిషికి. అయితే గొంతు నొప్పి (Sore throat) కూడా ఒకటి సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పి (Headache) వంటివి కూడా వస్తాయి. గొంతు నొప్పి  (Sore throat) వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు (sore throat remedies) తెలుసుకుందాం...

    కొంతమంది తరచూ గొంతునొప్పి (Sore throat)తో బాధపడుతూ ఉంటారు. సీజన్‌ మారినప్పుడల్లా ఈ ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఇంట్లో లభించే సహజ పదార్థాలతో వ్యాధిని నయం చేసుకోవచ్చు. గొంతనొప్పికి చక్కటి చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం..

    ల‌వంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి ప‌దార్థాల‌ను వేసి టీ త‌యారు చేసుకుని వేడి వేడిగా తాగాలి. ఈ మ‌సాలా టీతో గొంతు నొప్పి (Sore throat) ఇట్టే త‌గ్గిపోతుంది. ఇంకో పద్దతి ఏంటంటే.. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో చిక్కని అల్లం ర‌సం వ‌స్తుంది. అప్పుడు ఆ ర‌సాన్ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్షణాల్లో త‌గ్గుతుంది.

    గొంతు నొప్పి (Sore throat) , ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ‌గా ఉంటే వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. ఆయా స‌మస్యలకు చికెన్ సూప్ (Chicken soup) ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. మరో పద్దతి ఏంటంటే..  మిరియాల‌తో చేసిన చారు, లేదంటే మిరియాలు వేసి మ‌రిగించిన పాల‌ను తాగుతుంటే గొంతు నొప్పి  (Sore throat) త‌గ్గుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మస్యలు కూడా మాయ‌మ‌వుతాయి.

    ఇది కూడా చదవండి: జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే.. ఈ ఆయిల్​ వాడితే చాలు.. జుట్టు బలంగా అవుతుంది

    లేదా  ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెల‌ను క‌లుపుకుని తాగాలి. వీటిలో ఉండే స‌హ‌జ సిద్ధమైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు గొంతు నొప్పిని  (Sore throat) త‌గ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌లను పోగొడ‌తాయి. జ‌లుబు కూడా త‌గ్గుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ayurveda health tips, Ginger, Health Tips, Tea

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు