హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !

Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !

  మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు ! లుక్కేయండి

మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు ! లుక్కేయండి

కొన్ని రకాల హెర్బల్స్(Herbals), సుగంధ ద్రవ్యాలు కూడా బరువు(Weight) తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. వీటిని తరచూ ఆహారం(Food)లో తీసుకుంటే అధికంగా తినకుండా నిరోధిస్తూ.. బరువు తగ్గేలా చేస్తాయని సూచిస్తున్నారు. ఆ పదార్థాలు ఏవో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బరువు(Weight) పెరిగినంత ఈజీగా తగ్గడం సాధ్యంకాదు. ఇది చాలా కష్టమైన పని. కఠినమైన వ్యాయామం(Exercise), ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితో బరువు తగ్గడానికి ప్రయత్నించవచ్చు. అలాగే కొన్ని రకాల ఫుడ్స్, డ్రింక్స్ కూడా బరువు తగ్గించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తాయి. బెస్ట్ రిజల్ట్స్ కోసం వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. కొన్ని రకాల హెర్బల్స్(Herbals), సుగంధ ద్రవ్యాలు కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటే అధికంగా తినకుండా నిరోధిస్తూ.. బరువు తగ్గేలా చేస్తాయని సూచిస్తున్నారు. ఆ పదార్థాలు ఏవో తెలుసుకుందాం..


దాల్చినచెక్క

ఈ సుగంధ దినుసు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలం. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరం(Body)లో ఆక్సిడేషన్ స్ట్రెస్‌కు చెక్ పెట్టడానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

పసుపు

భారతీయ వంటల్లో పసుపు తప్పనిసరిగా వాడతారు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడంలోనూ పసుపు పాత్ర కీలకం. ఇందులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం బరువు తగ్గడానికి దోహదపడుతుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది బాడీ ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేషన్‌ స్ట్రెస్‌తో పోరాడుతూ శరీరక సమస్యలను దూరం చేస్తుంది.

ఒరేగానో (Oregano)

ఇది పుదీనా జాతికి చెందిన మొక్క. ఇందులో కార్వాక్రోల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీన్ని తరచూ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గడంలో కీలకంగా మారుతుంది. అంతేకాకుండా కొవ్వు పెరుగుదలను కూడా తగ్గిస్తుంది.

జీలకర్ర

జీలకర్రతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కల్పించడంలో జీలకర్ర పాత్ర అమోఘం. బరువు తగ్గించే ప్రక్రియలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీర కొవ్వును కూడా తగ్గిస్తుంది.

నల్ల మిరియాలు

ఇందులో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బరువు తగ్గే ప్రక్రియలో కీలకంగా మారుతుంది. నల్ల మిరియాల ప్రభావంపై చేసిన కొన్ని పరిశోధనల్లో బెస్ట్ రిజల్ట్స్ కనిపించాయి. అయితే ఈ పరిశోధనలను జంతువులు, టెస్ట్-ట్యూబ్‌కు మాత్రమే పరిమితం చేశారు. దీని ప్రభావం మానవుల ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: Green Tea with Lemon: నిమ్మకాయతో గ్రీన్ టీ కలిపి తాగారా.. దీని వల్ల ఎన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చో తెలుసా !


కొన్ని రకాల డ్రింక్స్ కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. అవేంటంటే..

- వాము నీరు

వాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియను వేగవంతం చేసేందుకు సహకరిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక టీస్పూన్ వాము నీటిలో ఉడకబెట్టండి. దీనికి నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి సేవించాలి. దీన్ని తరచూ తీసుకుంటూ ఉండండి.

- అల్లం, నిమ్మరసం

అల్లం, నిమ్మరసం కలిపిన నీరు తాగితే వికారం, అజీర్ణం వంటి పొట్టకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం, అల్లం రసం కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.

- తేనె, నిమ్మరసం

నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంత నిమ్మరసం, తేనె కలుపుకుని ఉదయాన్నే సేవించటం ఆరోగ్యానికి చాలా మంచిది.

First published:

Tags: Health Tips, Lemon Tea, Turmeric, Weight loss tips

ఉత్తమ కథలు