Sleep problem: రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా.. అయితే ఈ చిట్కాలు పాటించండి

ప్రతీకాత్మకచిత్రం

నిద్ర(sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది

 • Share this:
  అసలే ఉరుకుల పరుగుల జీవితం. ఈ బిజీబిజీ  జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం ( Sleeping ) అనేది ఒక వరంలాంటిదే. కరోనా(corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత(peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి జీవుడిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి, నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడి(pressure)కి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై (Health) పడుతుంది. నిద్ర(sleep) కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.

  నిద్ర అనేది శారీరక అవసరం(need) అయినా.. దానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి. దీంతో కాస్త ప్రశాంతత కలుగుతుంది. టెన్షన్ తో నిద్రపట్టకపోతే 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస(breath) తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.నిజానికి మనం ఎక్కువగా ఆలోచించడం(thinking) వల్ల లేనిపోని టెన్షన్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. అందుకే అయిందేదో అయింది.. అంతా మనమంచికే.. జరిగేదేదో అది కూడా మన మంచికే అని అనుకోవడం ప్రారంభించండి. ఇలా అనుకోవడం దిగులు తగ్గుతుంది. చాలా మంది ప్లానింగ్ లేకుండా పని చేస్తుంటారు. దీని వల్ల కూడా టెన్షన్ పెరిగి అది నిద్ర కరువు అవుతుంది. అందుకే మరుసటి రోజుకు సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. దాంతో ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.

  ఆరోగ్యవంతులు, సాధారణ వ్యక్తులైతే 10 నుంచి గరిష్టంగా 30 నిమిషాలు కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు. గర్భంలో శిశువు ఉండే మాదిరిగా ముడుచుకుని పడుకోవాలి. అయితే ఎడమవైపు తిరిగి నిద్రిస్తే అధిక ప్రయోజనం ఉంటుందట. చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గరిష్టంగా 90 నిమిషాలపాటు నిద్ర శ్రేయస్కరం.చర్మ సౌందర్యం కోసం, యవ్వనం కోసం సరైన, హాయినిచ్చే నిద్ర ఎంతో అవసరం. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. రాత్రి పూట ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాతే నిద్రపోవాలి. ఎందుకంటే మేకప్, దుమ్ము ముఖం మీది చర్మ రంద్రాలను మూసివేస్తాయి. అలానే ఆల్కహాల్ లేని టోనర్ ఉపయోగించాలి. రోజ్ వాటర్ వాడాలి. అలాగే చర్మాన్ని మెరిపించే విటమిన్ సి సీరమ్ వాడాలి.
  Published by:Prabhakar Vaddi
  First published: