Home /News /life-style /

IF YOU FOLLOW THESE TIPS TO REDUCE TOOTHACHE OR GET IMMEDIATE RELIEF AND THE PAINS WILL BE REDUCED PRV

Teeth pain: పంటి నొప్పి ఎక్కువగా ఉందా? అయితే ఈ చిన్న చిట్కాతో నొప్పిని దూరం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నొప్పి తగ్గాలంటే తప్పకుండా డెంటిస్టును సంప్రదించాల్సిందే. ఒక వేళ మీ వద్ద అంత సమయం లేకున్నా.. తక్షణ ఉపశమనం కావాలన్నా. కొన్ని చిట్కాలు (health tips) పాటిస్తే నొప్పులు తగ్గుతాయి.

    దంతాలు (Teeth) ఆహారం బాగా నమిలి తినడానికి ఆయుధం లాంటిది. అయితే ఏది పడితే అది తినడం వల్లనో.. దెబ్బలు తగలడం వల్లనో పళ్లు దెబ్బతింటాయి (teeth damage). దీంతో ఒక్క పన్ను నొప్పి (Teeth pain) పుట్టినా ఎక్కువగా బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి (Pain) ఏర్పడుతుంది. కానీ, ఇది ఒక్కసారి మొదలైందంటే.. అంత ఈజీగా తగ్గదు. ఈ నొప్పి తగ్గాలంటే తప్పకుండా డెంటిస్టును సంప్రదించాల్సిందే. ఒక వేళ మీ వద్ద అంత సమయం లేకున్నా.. తక్షణ ఉపశమనం కావాలన్నా. కొన్ని చిట్కాలు (health tips) పాటిస్తే నొప్పులు తగ్గుతాయి.

    సున్నితంగా రుద్దుతూ..

    ఒక ఐస్‌ (Ice) ముక్కని తీసుకోని ఓ క్లాత్‌ (cloth)లో పెట్టుకోని వాటిని పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో సున్నితంగా రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్తనాళాలు ఇంకా రక్త ప్రసరణ అనేవి మెరుగుపడి నొప్పి ఇంకా మంట అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా వాపు కారణంగా వచ్చే పంటినొప్పి (teeth pain)కి ఇది ఓ చక్కటి చిట్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఉప్పు నీటితో..

    ఇక అలాగే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌ కారణంగా కూడా పంటినొప్పి అనేది చాలా ఎక్కువవుతుంది. ఇక అలాంటి సమయంలో వేడినీటి (hot water)ని తీసుకోని అందులో ఓ చిటికెడు ఉప్పు (salt) ని వేసి ఇక ఆ నీటిని ఒక పది నిమిషాలపాటు బాగా పుకిలించి ఉంచాలి. ఇలా రోజులో మీకు వీలైనన్ని సార్లు చేయడం చాలా మంచిది. దీంతో మీకు ఆ పంటి చుట్టూ వుండే ఇన్ఫెక్షన్‌ (infection) కు కారణమైన అనేక క్రిములు అనేవి వెంటనే నశించడం జరుగుతుంది.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    అలాగే మీకు ఏదైన ఆహార పదార్థం (food item) కనుక మీ పళ్ల మధ్యలో ఇరుక్కుపోయినా కాని అది వెంటనే బయటకు వచ్చేస్తుంది. దాంతో మీ పంటి నొప్పి (teeth pain) సమస్య అనేది తక్షణమే తీరిపోతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    ఇవి కూడా చదవండి:  26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్​.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health Tips, Life Style, Teeth

    తదుపరి వార్తలు