హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Beauty tips: మీ ముఖం​లో పగుళ్లు వస్తున్నాయా? అయితే ఈ చిట్కా పాటించండి.. ముఖాన్ని రక్షించుకోండి

Beauty tips: మీ ముఖం​లో పగుళ్లు వస్తున్నాయా? అయితే ఈ చిట్కా పాటించండి.. ముఖాన్ని రక్షించుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పగిలిన చర్మం రిపేర్ చేసుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు రాస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరినూనె రాసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీటితోపాటు కొన్ని ఆహార పదార్థాలను కూడా ప్రతిరోజు తీసుకోవాలి. దాంతో చర్మం పగలకుండా ఉంటుంది.

ఇంకా చదవండి ...

అందం (Beauty). ప్రతి ఒక్కరూ కోరుకునేది. వాతావరణం కాలుషితం అవుతుండటంతో మన ముఖం కూడా పాడవుతోంది. ఏవేవో పనికిరాని క్రీమ్​లు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు చాలామంది. ఇక కొంతమందైతే ఆ క్రీమ్ (creams)​లు లేకుండా బతకలేం అన్నంతగా వాడుతారు. అలాంటి వారు ముఖానికి ఏదో ఒకటి కెమికల్​ క్రీమ్​లు వాడందే బయట పడరు. ఇక వారిని ఆ క్రీమ్​లు లేకుండా చూస్తే మాత్రం గుర్తే పట్టలేం. అయితే సహజసిద్ధంగా తయారు చేసుకునే ఫేస్​ప్యాక్​లతో కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఉండవు. మామూలుగా చాలామందికి చర్మం పగుళ్లు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వేసవి కాలంలో కూడా  శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, చర్మం పగుళ్ళకు (Cracked skin) దారితీస్తుంది.. ఈ పగిలిన చర్మం  (cracked skin) రిపేర్ చేసుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు రాస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరినూనె (coconut oil) రాసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీటితోపాటు కొన్ని ఆహార పదార్థాలను (food items) కూడా ప్రతిరోజు తీసుకోవాలి. దాంతో చర్మం పగలకుండా (Skin Not cracked) ఉంటుంది. అంతేకాకుండా చర్మం మృదువుగా (Soft), కాంతివంతంగా (bright) మారుతుంది. అయితే మరి చర్మ సంరక్షణకు (skin care) ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో.. తెలుసుకుందాం..

నారింజతోనూ..

నారింజ (Orange)పండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి (skin) మేలు చేస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే విటమిన్ సి చర్మానికి రక్షణ ఇచ్చి, చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తుంది. ఫలితంగా చర్మం ప్రకాశిస్తుంది (skin glow).. దానిమ్మ పండ్లను చూడగానే చాలు ప్రతి ఒక్కరికి తినాలనే ఆశ పుడుతుంది. ఎర్రగా నిగనిగలాడుతూ భలే ఉంటుంది. దానిమ్మ (Pomegranate) పండ్లలో  నీరు అధికంగా ఉంటుంది.  ఇక దీన్ని తినడం వల్ల చర్మం ఎప్పుడూ తేమగా,మృదువుగా (soft) ఉంటుంది. అలాగే చర్మానికి చక్కని వన్నె తో పాటు టోన్ ను అందిస్తుంది. వీటిలో విటమిన్ సి,యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నిర్మూలిస్తాయి. ఫలితంగా చర్మం పగలకుండా ఉంటుంది..

బ్రోకలిలో విటమిన్ ఏ, విటమిన్ సి లు ఉంటాయి. కణజాలాలతో పాటు చర్మం, వెంట్రుకల (hairs) కణాలు పెరిగేందుకు  ఈ విటమిన్లు ఉపయోగపడతాయి. అంతేకాకుండా కొల్లాజెన్  అనబడే ప్రోటీన్ చర్మ కణాలకు మరమ్మతులు చేసి, ఇక విటమిన్ బి చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుతుంది. ప్రతిరోజు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ప్రకాశిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. ఫలితంగా చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇక వీటిలో ఉండే విటమిన్ సి ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడి, చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వృద్యాప్య ఛాయలు కూడా దరిచేరవు..

First published:

Tags: Beauty, Beauty tips, Face mask, Life Style

ఉత్తమ కథలు