Home /News /life-style /

IF YOU FACING TEETH PAIN PROBLEM REGULARLY THEN FOLLOW THIS EASY TIPS TO GET RID OF THAT PAIN PRV

Teeth pain: మీకు పంటి నొప్పి తరచుగా వస్తోందా? అయితే ఈ టిప్స్​ పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దంతాలు అందరికీ ముఖ్యమే. ఆహారం నమిలి తినడానికి ఎంతో అవసరం. అయితే చాలామందికి పంటిలో నొప్పి రావడం వల్ల ఎక్కువగా నమిలి తినలేరు. బ్రష్​ కూడా చేయలేరు. నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ టిప్స్​.

    దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రంగు మారుతుంటాయి. పసుపు పచ్చ (yellow)గా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా (smile) మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాలు (Teeth) ఆహారం బాగా నమిలి తినడానికి ఆయుధం లాంటిది. అయితే ఏది పడితే అది తినడం వల్లనో.. దెబ్బలు తగలడం వల్లనో పళ్లు దెబ్బతింటాయి (teeth damage). దీంతో ఒక్క పన్ను నొప్పి (Teeth pain) పుట్టినా ఎక్కువగా బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి (Pain) ఏర్పడుతుంది. కానీ, ఇది ఒక్కసారి మొదలైందంటే.. అంత ఈజీగా తగ్గదు. ఈ నొప్పి తగ్గాలంటే తప్పకుండా డెంటిస్టును సంప్రదించాల్సిందే. ఒక వేళ మీ వద్ద అంత సమయం లేకున్నా.. తక్షణ ఉపశమనం కావాలన్నా. కొన్ని చిట్కాలు (health tips) పాటిస్తే నొప్పులు తగ్గుతాయి.

    ఒక ఐస్‌ (Ice) ముక్కని తీసుకోని ఓ క్లాత్‌ (cloth)లో పెట్టుకోని వాటిని పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో సున్నితంగా రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్తనాళాలు ఇంకా రక్త ప్రసరణ అనేవి మెరుగుపడి నొప్పి ఇంకా మంట అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా వాపు కారణంగా వచ్చే పంటినొప్పి (teeth pain)కి ఇది ఓ చక్కటి చిట్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    భరించలేని పంటినొప్పి (toothache)తో బాధపడేవారికి వెల్లుల్లికూడా బాగా పనిచేస్తుంది (works). ఇక ఇందులో శక్తివంతమైన యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు అనేవి ఉంటాయి. మీకు బాగా విపరీతమైన పంటి నొప్పి వచ్చిన వారు వెల్లుల్లిని బాగా దంచి దాన్ని కాస్త ఉప్పు (salt) లేదా మిరియాల పొడితో కలిపి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో దాన్ని రాయాలి. ఇలా చేస్తే కనుక చేస్తే తక్షణమే పంటి నొప్పి నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక అలాగే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌ కారణంగా కూడా పంటినొప్పి అనేది చాలా ఎక్కువవుతుంది.

    ఇక అలాంటి సమయంలో వేడినీటి (hot water)ని తీసుకోని అందులో ఓ చిటికెడు ఉప్పు (salt) ని వేసి ఇక ఆ నీటిని ఒక పది నిమిషాలపాటు బాగా పుకిలించి ఉంచాలి. ఇలా రోజులో మీకు వీలైనన్ని సార్లు చేయడం చాలా మంచిది. దీంతో మీకు ఆ పంటి చుట్టూ వుండే ఇన్ఫెక్షన్‌ (infection) కు కారణమైన అనేక క్రిములు అనేవి వెంటనే నశించడం జరుగుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Teeth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు